రాధేశ్యామ్ యూఎస్ షోల‌లో కృష్ణంరాజు మిస్ అయ్యారా..?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. యంగ్ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ భారీ పిరియాడిక్ ల‌వ్ స్టోరీ రాధేశ్యామ్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూశారు. ఆఖ‌రికి ఈ రోజు థియేట‌ర్లోకి వ‌చ్చింది. అయితే… తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అన్ని చోట్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.

రాధేశ్యామ్ మూవీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస అనే పాత్రను పోషించారు. ప్రభాస్, కృష్ణంరాజు కాంబినేష‌న్లో వచ్చిన మూడవ చిత్రం రాధేశ్యామ్. ఇంతకు ముందు వీరిద్దరూ రెబల్, బిల్లా చిత్రాల్లో క‌లిసి న‌టించారు. అయితే.. రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు పాత్ర‌ను తెలుగుకు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. ఈ పాత్ర‌ను వేరే భాష‌ల్లో త‌మిళ యాక్ట‌ర్ స‌త్య‌రాజ్ పోషించారు. ట్రైల‌ర్లోనే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలిసింది.

అయితే… ఈ భారీ చిత్రం తెలుగు వెర్షన్ లో కూడా కృష్ణంరాజు బదులు సత్యరాజ్ కనిపించినట్లు యూఎస్ఏ ప్రేక్షకులు తెలియ‌చేశారు. ఒకే భాష కోసం మేకర్స్ రెండు వేర్వేరు వెర్షన్లను రూపొందించారా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కృష్ణంరాజు ఈ చిత్రంలో నటించడమే కాకుండా తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మరి అలాంటప్పుడు యూఎస్ ప్రింట్‌లో తెలుగు వెర్షన్‌లో కృష్ణం రాజుకి బదులుగా సత్యరాజ్‌ని ఎందుకు చూపించారనేది ఆస‌క్తిగా మారింది. దీని పై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. మ‌రి.. మేక‌ర్స్ ఇలా ఎందుకు చేశారో.. క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Related Posts