తెలుగులో పా..పా.. గా వస్తున్న దా..దా..

దా..దా.. ఈ మూవీ తమిళ్‌లో రిలీజయి సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమాను పా..పా.. పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ పై ఎం. ఎస్. రెడ్డి గారు ఈ సినిమాను తెలుగులోకి అనువదించారు. తెలుగు వెర్షన్‌ టైటిల్‌ను నక్కిన త్రినాధరావు లాంచ్ చేసారు.


దా..దా.. అంటే నాన్న తెలుగులో పా..పా.. అంటే ఏంటి అన్నాను పా..పా.. అంటే కూడా నాన్న అన్నారు. ఈ సినిమా రైటర్ మరియు డైరెక్టర్ గణేష్ కె బాబు ప్రతి సీను చాలా బాగా రాసుకున్నాడు. ఏదైతే రాసుకున్నాడో ఎగ్జాక్ట్ గా అదే తీశాడు. తన రైటింగ్ స్టైల్ చాలా బాగా నచ్చింది. ఇది ఒక నాన్న కథ మాత్రమే కాదు ఒక స్నేహితుడు కథ ఒక ఒక అమ్మ కథ ఒక లవర్ కథ. రెండు షేడ్స్ లో హీరో కవిన్ క్యారెక్టర్రైజేషన్ చాలా బాగుంది అన్నారు నక్కిన త్రినాధరావు. ప్రొడ్యూసర్స్‌ని, ఆర్టిస్టులను, టెక్నిషియన్స్‌ని ప్రత్యేకించి అభినందించారు.


ఈ దా..దా.. సినిమాని 50 రోజుల తర్వాత థియేటర్లో చూశాను అప్పటికి 70 శాతం ఫుల్స్ తో ఆడుతోంది. ఈ మూవీ చూసిన వెంటనే నచ్చి యుఎస్ లో ఉన్న నా ఫ్రెండ్స్ శ్రీకాంత్, శశాంక్ కి కాల్ చేసి చెప్పాను ఒక మంచి సినిమా చూశాను అని. చెప్పగానే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఈ సినిమాని తెలుగులో తీసుకొద్దామన్నారని చెప్పారు నిర్మాత ఎంఎస్‌ రెడ్డి గారు. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ లాంచ్ చేసిన నక్కిన త్రినాధరావుగారికి కృతజ్ఞతలు అంటూ థ్యాంక్స్ చెప్పారు ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి.

Related Posts