సినిమా టిక్కెట్ రేట్ల విష‌య‌మై ముగిసిన క‌మిటీ స‌మావేశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు త‌గ్గించ‌డం.. సినీ ప్ర‌ముఖులు టిక్కెట్ల రేట్ల‌ను పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌డం తెలిసిందే. వివాద‌స్ప‌ద‌మైన ఈ విష‌యం గురించి చ‌ర్చించ‌డానికి ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీలో 13 మంది స‌భ్యులు ఉన్నారు. ఈ క‌మిటీ ఈరోజు స‌మావేశ‌మైంది. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి విశ్వ‌జిత్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులు త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఈ స‌మావేశం అనంత‌రం ప్రేక్ష‌కుల సంఘం త‌రుపున హ‌జ‌రైన క‌మిటీ స‌భ్యురాలు ల‌క్ష్మీ మీడియాతో మాట్లాడారు.

జీవో 35 ప్ర‌కార‌మే ధ‌ర‌లు ఉండాల‌ని కమిటీకి చెప్పామ‌ని.. థియేట‌ర్లో స‌దుపాయాలు స‌రిగా లేక‌పోవ‌డం పై కూడా చెప్పామ‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టిక్కెట్ల ధ‌ర‌లు పెంచాల‌ని చెప్పామ‌ని తెలియ‌చేశారు. ఎగ్జిబ్యూట‌ర్స్ త‌రుపున హాజ‌రైన స‌భ్యుడు బాల‌ర‌త్నం మాట్లాడుతూ.. టిక్కెట్ ధ‌ర‌ల త‌గ్గింపుతో రాష్ట్రంలో దాదాపుగా 200 థియేట‌ర్ల మూత‌ప‌డిన విష‌యం క‌మీటి దృష్టికి తీసుకెళ్లాం. థియేట‌ర్ల నిబంధ‌న‌ల విష‌యంలో కొంత వెసుల‌బాటు క‌ల్పించాల‌ని కోరామ‌ని చెప్పారు. బి,సి సెంట‌ర్స్ లో రేటు మార్పు చేయాల్సివుంద‌ని మ‌రో స‌భ్యుడు ముత్యాల రాందాస్ చెప్పారు. వ‌చ్చే స‌మావేశంలో తుది నిర్ణ‌యం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు.

Related Posts