Categories: Latest

కేజీఎఫ్ సంగీత దర్శకుడి నుంచి వస్తున్న శాసనసభ

కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలకు రవిబసుర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సంగీత, నేపథ్యసంగీతం పనుల్లో సంగీత దర్శకుడు రవిబసుర్ బిజీగా వున్నారు. ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా వుంటుంది. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా వుంది. శాసనసభ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్బుతంగా అవుట్‌పుట్ వచ్చింది.కేజీఎఫ్-2 తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి, కెమెరా: కృష్ణమురళి

Telugu 70mm

Recent Posts

Everything is ready for the grand event of ‘Kalki’

The team is going to increase the speed in the campaign of 'Kalki 2898 AD'…

5 hours ago

Kiara about ‘Game Changer, War 2’ in Cannes..!

Bollywood beauty Kiara Advani made a splash at the prestigious International Film Festival Cannes. Kiara…

5 hours ago

సురేష్ ప్రొడక్షన్స్ ఆరంభించి అరవై ఏళ్లు

ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి.. ప్రపంచ రికార్డును నెలకొల్పి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. స్కిప్టుతో వస్తే..…

6 hours ago

‘కల్కి‘ గ్రాండ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఎ.డి.‘ ప్రచారంలో స్పీడు పెంచబోతుంది టీమ్. తొలిసారి ఈ సినిమాకోసం గ్రాండ్…

6 hours ago

కేన్స్ లో ‘గేమ్ ఛేంజర్, వార్ 2‘ గురించి కియారా..!

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కేన్స్ లో సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కేన్స్ లో జరిగిన…

7 hours ago

Once again ‘Godfather’ combination

Director Mohan Raja directed the movie 'Godfather' with Megastar Chiranjeevi. The film is a remake…

7 hours ago