సినిమా జయాపజయాలు నెక్స్ట్ మూవీస్ మీద ప్రభావం చూపిస్తున్న రోజులివి. మరి ఇప్పుడు నాగచైతన్య ఏం చేస్తున్నారు? ఈ ఏడాది సంక్రాంతికి అక్కినేని నాగార్జునతో కలిసి బంగార్రాజులో నటించారు నాగచైతన్య. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ రికార్డ్ చేసుకుంది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన థాంక్యూ రిలీజ్ అయింది. ఆ సినిమా గురించి నిర్మాత దిల్‌రాజు ఓ రేంజ్లో పబ్లిసిటీ చేశారు. తన లైఫ్‌లో తనకు సాయం చేసిన వారందరినీ గుర్తుచేసుకుని లిస్టు రాసుకుని మరీ వెళ్లి కలిసొచ్చానని అన్నారు.
అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అందులో నుంచి తేరుకునేలోపు నాగచైతన్యను లాల్‌సింగ్ చడ్డా రూపంలో మరో ఫ్లాప్ పలకరించింది. అక్కినేని యంగ్ హీరో బాలీవుడ్ ఎంట్రీ, అందులోనూ ఆమీర్ఖాన్లాంటి హీరోతో కలిసి అని అనగానే అందరూ వావ్ అన్నారు. చిరంజీవి ఈ ప్రాజెక్టును స్వయానా ముందుకు నడిపారు.సినిమాలో పస లేకుండా ఎంత పబ్లిసిటీ చేసినా వేస్టే అనే విషయం ఈ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది.అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్ ని పెద్దగా పట్టించుకోనని, వాట్ నెక్స్ట్ అనే దాని మీదే తన వ్యూ మొత్తం ఉంటుందని ఇప్పటికే నాగచైతన్య చాలా సార్లు చెప్పారు.
ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటూ ముందుకెళ్తున్నారు చైతన్య. ఆయన కెరీర్లోనే వెరీ బిగ్ బడ్జెట్‌తో ఓ సినిమాను తెరకెక్కించడానికి మేకర్స్ రెడీ అయ్యారు.వెంకట్ ప్రభు డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే మొదలుకాబోతోంది. ఈ సినిమా కోసం నాగచైతన్య నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపించబోతున్నారట. హైదరాబాద్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఆల్రెడీ బంగార్రాజులో చైతూ పక్కన హీరోయిన్గా నటించింది కృతి శెట్టి. ఆ సినిమా సక్సెస్ అయింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు అక్కినేని అభిమానులు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…