ఆలియా నీ డెడికేషన్‌కి తాలియా అంటూ భట్ భేటీ ఆలియాను తెగ పొగుడుతోంది తెలుగు మీడియా. ఆ మధ్య బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలోనూ, బిగ్‌బాస్6 ఫస్ట్ ఎపిసోడ్‌లోనూ ఆలియా తెలుగువారికి దగ్గరైన తీరు చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. బ్రహ్మాస్త్రలోని కుంకుమలా పాటను ఆలియా స్క్రిప్ట్ చూడకుండా తెలుగులో పాడితే హోస్ట్ నాగార్జున కూడా అవాక్కయి చూశారు. ఆ రేంజ్లో తెలుగు పదాలు గుర్తుపెట్టుకుని మరీ స్పష్టంగా పాడారు ఆలియా. ట్రిపుల్ ఆర్ టైమ్‌లో స్పెషల్‌గా ట్యూటర్ని పెట్టుకుని ఆమె తెలుగులో ట్రయినింగ్ తీసుకున్న విషయాన్ని రణబీర్ ఆల్రెడీ మీడియాతో షేర్ చేసుకున్నారు. అంతమంది ఆదరణ పొందుతున్నారు కాబట్టే ఆలియాకు సోషల్‌మీడియాలో ఫాలోయర్లు వెల్లువెత్తుతున్నారు.నిన్నమొన్నటిదాకా ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌లో ఉన్న దీపిక పదుకోన్‌ని క్రాస్ చేసేశారు ఆలియా. ఇప్పుడు ఆమె ఇన్‌స్టా ఫ్యామిలీ స్ట్రెంగ్త్ 70 మిలియన్లు.
దీపిక పదుకోన్, కత్రినా కైఫ్‌ని ఒక్క దెబ్బతో దాటేశారు ఆలియా. ప్రియాంక చోప్రా తర్వాత హాలీవుడ్లో ప్రాజెక్టు చేసిన నటిగానే కాదు, ఆమె తర్వాత అత్యధిక మంది ఇన్‌స్టా ఫాలోయర్లున్న నటిగా కూడా రికార్డు క్రియేట్ చేశారు ఆలియా. ఆమె నటించిన గంగూభాయ్ కతియావాడి ఆస్కార్ రేసులో ఉంది. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ రేసులో ఉంది. ఆ మధ్య ఓన్ ప్రొడక్షన్ హౌస్‌లో చేసిన సినిమాను కూడా ఓటీటీ మంచి లాభం ఇచ్చి కొనుగోలు చేసింది. ఇప్పుడు బ్రహ్మాస్త్రకు స్పెషల్ క్రేజ్ ఉంది. పర్సనల్ లైఫ్‌లో కోరుకున్న వ్యక్తితో పెళ్లయింది. ఆ వెంటనే తల్లికాబోతున్న మాటనూ అనౌన్స్ చేసింది. 2022 ఎన్నెన్నో విధాలుగా నేను గుర్తుపెట్టుకోదగ్గ సంవత్సరం అని కృతజ్ఞతాభావంతో చెబుతున్నారు ఆలియా.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…