మెగాస్టార్ మూవీకి డేట్స్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీని సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఇది మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన లూసిఫ‌ర్ మూవీకి రీమేక్. దీనికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని గ‌త కొన్ని రోజులు నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఇది నిజ‌మేనా..? కాదా..? అనేది ఆస‌క్తిగా మారింది. తాజా అప్ డేట్ ఏంటంటే.. స‌ల్మాన్ ఖాన్ గాడ్ ఫాద‌ర్ మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

అంతే కాకుండా.. 2022 ఫిబ్రవరి నెలలో షూటింగ్ లో పాల్గొంటాన‌ని స‌ల్మాన్ డేట్స్ ఇచ్చార‌ని స‌మాచారం. ఫిబ్ర‌వ‌రిలో జరుగనున్న షెడ్యూల్ లో కండల వీరుడి పాత్రకు సంబంధించిన షూటింగ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం సల్మాన్ 15 రోజుల సమయాన్ని కేటాయించార‌ని తెలిసింది. చిరంజీవి, రామ్ చరణ్ లతో సల్మాన్ ఖాన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుక‌నే.. కనీసం పాత్ర గురించి కూడా అడగకుండా.. బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ గాడ్ ఫాదర్ లో గెస్ట్ రోల్ చేయడానికి వెంటనే అంగీకరించారు.

చిరుతో క‌లిసి స‌ల్మాన్ న‌టించ‌నున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి గాడ్ ఫాద‌ర్ మూవీ పై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయ‌ని చెప్ప‌చ్చు. న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. 2022లో ఆగ‌ష్టులో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం. మ‌రి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గాడ్ ఫాద‌ర్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Related Posts