బాబీ డియోల్ లైనప్ మామూలుగా లేదు

ఒకప్పుడు బాలీవుడ్ లో ‘గుప్త్, సోల్జర్‘ వంటి బడా హిట్స్ అందుకున్న బాబీ డియోల్ ఆ తర్వాత విజయాలకు దూరమయ్యాడు. ‘హౌస్ ఫుల్ 4‘తో మళ్లీ బీటౌన్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. సౌత్ లో మాత్రం ఫుల్ బిజీ అయిపోతున్నాడు. ఒకవిధంగా బాబీ డియోల్ ‘యానిమల్‘తో విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. ‘యానిమల్‘ మూవీతో హీరోగా రణ్ బీర్ కపూర్ కి ఎంత పేరొచ్చిందో.. అంతే స్థాయిలో విలన్ గా చేసిన బాబీ డియోల్ కి పేరొచ్చింది.

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తన విలనిజాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్.
తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘లో ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు బాబీ. అయితే.. ఈ మూవీ షూటింగ్ డేలే అయ్యింది. ఈలోపులో నటసింహం బాలకృష్ణ రూపంలో మరో క్రేజీ తెలుగు మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాలకృష్ణ 109 లో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. నిన్న బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బాబీ వెల్కమ్ అబార్డ్ అంటూ తన ప్రాజెక్టులోకి బాబీ డియోల్ ని ఆహ్వానిస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సూర్య కంగువ’లోనూ బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. సిరుత్తై శివ డైరెక్షన్ లో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి బాబీ డియోల్ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన పోస్టర్ కి సూపర్బ్ అప్లాజ్ వస్తోంది. మొత్తంమీద.. ‘యానిమల్’ తర్వాత బాబీ డియోల్ లైనప్ అయితే మామూలుగా లేదు.

Related Posts