భూతద్దం భాస్కర్‌నారాయణ రివ్యూ

డిటెక్టివ్ థ్రిల్లర్స్‌ అంటే న్యూట్రల్ ఆడియెన్స్‌ కూడా చాలా ఇష్టపడతారు. అన్ని వర్గాలు ఆసక్తిగా చూసే సినిమాలుగా మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో డిటెక్టివ్ సినిమాలొచ్చాయి… అయితే డిటెక్టివ్ అంశాలకు పురాణాలను జోడించిన కథాంశంతో వచ్చిన సినిమా భూతద్దం భాస్కర్‌నారాయణ. ట్రైలర్‌తో విపరీతమైన హైప్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా ? ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
ఆంధ్రా, కర్నాటక బోర్డర్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. అది కూడా మహిళల్నే చంపి, తలలు తీసేసి ఆ స్థానంలో దిష్టి బొమ్మలను పెడుతుంటాడు హంతకుడు. ఏమాత్రం క్లూ లేకుండా జరిగిన ఈ హత్యలు ఎవరు చేసారన్నది పోలీసులకు కష్టతరంగా మారుతుంది. లోకల్ డిటెక్టివ్ భాస్కర్‌ నారాయణ్ ఈ కేసును డీల్ చేయడానికి రెడీ అవుతాడు. మరి భాస్కర్‌ నారాయణ హంతకుడ్ని పట్టించాడా ? ఈ హత్యలకు పురాణాలకు లింకేంటి ? అనేది తెరమీద చూడాల్సిందే.

కథనం :
సాధారణంగా డిటెక్టివ్ సినిమాలంటే ఓ హత్య జరగడం.. దాని వెనుకున్న కారణాలను, హంతకులను పట్టించడం సర్వసాధారణం. ఈ మధ్య వస్తున్న సినిమాలను చూస్తుంటే సీరియల్ మర్డర్స్ జరగడం అవి కూడా ఒకే తరహాలో మర్డర్ చేయబడి ఉండటం.. ఏమాత్రం క్లూ వదలకుండా చేసిన ఆ సీరియల్‌ కిల్లర్‌ను అంతే తెలివిగా పట్టుకోవడం. భూతద్దం భాస్కర్‌ నారాయణ కూడా అలాంటి సినిమానే. కాకపోతే ఈ హత్యలకు దిష్టి బొమ్మలు తగిలించడం, పురాణాలకు లింక్ చేయడంతో సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ప్రత్యేకతకు తగ్గట్టే కథనం కూడా ఆసక్తికరంగా సాగుతుంది. సస్పెన్స్‌ ను చివరివరకు కంటిన్యూ చేయడంలోనే ఇలాంటి సినిమాలకు ప్రధాన బలం. ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు.
ఫస్టాఫ్‌ను సరదాగా స్టార్ట్‌ చేసి, లవ్‌ రొమాన్స్ అంటూ నింపేసిన డైరెక్టర్‌.. వరుస మర్డర్స్ నేపథ్యంతో ఆసక్తికరంగా సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ప్రతీ సీన్‌, ట్విస్ట్‌ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతాయి. ఇన్విస్టిగేషన్‌ సీన్స్ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా ఓవరాల్‌ గా సూపర్బ్ అని చెప్పక తప్పదు. ఫస్టాఫ్‌లో కొన్ని రొటీన్‌ సీన్స్, కాస్త ల్యాగ్‌ మైనస్‌ అనిపించినా… మెయిన్ టార్గెట్ థ్రిల్లర్ లవర్సే కాబట్టి.. వారిని శాటిస్ఫై అయ్యేలా ఆద్యంతం డీల్ చేసాడు దర్శకుడు.

నటీనటులు :
భాస్కర్‌ నారాయణ పాత్రలో శివ కందుకూరి చక్కగా కుదిరాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. రెగ్యులర్ డిటెక్టివ్‌లా సూట్‌, హ్యాట్‌ తో కాకుండా.. లోకల్‌ కుర్రాడు డిటెక్టివ్ అయితే ఎలా ఉంటాడో అలా కనిపించాడు. రిపోర్టర్ పాత్రలో రాశీసింగ్ నటన కూడా బావుంది. మిగిలిన నటీనటులు పాత్ర పరిధి మేరకు నటించి న్యాయం చేసారు.

టెక్నిషియన్స్ : ఈ సినిమాకు కర్త కర్మ దర్శకుడు పురుషోత్తం రాజ్‌. పూర్తిస్థాయిలో చివరివరకు సస్పెన్స్‌ మెయిన్‌టెన్ చేస్తూ.. టెంపో ఎక్కడా తగ్గకుండా ఆడియెన్స్‌ని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. ఆ తర్వాత ఈ సినిమాకి ప్రధానబలంగా నిల్చింది శ్రీ చరణ్‌ పాకాల సంగీతం. ప్రతీ సీన్‌ని ఎలివేట్ చేసింది. విజువల్స్ అద్భుతంగా తీసారు. వీఎఫ్ఎక్స్‌ వర్క్‌ కూడా సినిమాకు ప్లస్‌. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ని మెచ్చుకోవచ్చు.

బోటమ్‌ లైన్‌ : భూతద్దం భాస్కర్‌… డిఫరెంట్ థ్రిల్లర్‌

రేటింగ్ : 3/5

Related Posts