భళా తందనానా.. భలే ఉందీ మెలోడీ

భళా తందనాన.. శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న చిత్రం. ఒకప్పుడు బాణం అనే మూవీతో ఆకట్టుకున్న చైతన్య దంతులూరి డైరెక్ట్ చేస్తున్నాడు. కేథరీన్ థ్రెస్సా హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే శ్రీ విష్ణు సినిమా అంటే కంటెంట్ కొత్తగా ఉంటుందనే టాక్ ఉంది కాబట్టి.. ఈ మూవీపై అంచనాలు కూడా ఉన్నాయి. ఇక మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా ఓ బ్యూటీఫుల్ మెలోడీయస్ సాంగ్ ను ఉస్తాద్ హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేశారు.
దర్శకుడు చైతన్య దంతులూరి చేసింది రెండు సినిమాలే. మొదటిది బాణం. రెండోది బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నటించిన బసంతి. ఈ రెండు చిత్రాల్లోనూ సంగీతం పరంగా అతని కంటూ ఓ టేస్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే కంటెంట్ విషయంలో కూడా ఇప్పటి దర్శకుల్లా ఆలోచించడు. సినిమాలు ఆడాయా పోయాయా అనేది పక్కన బెడితే చైతన్య దర్శకత్వం బానే ఉంటుందని చెప్పొచ్చు. మరి సంగీతం పై స్పెషల్ టేస్ట్ ఉంది కాబట్టే మణిశర్మతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. బాణంలో మూడు పాటలూ బ్యూటీఫుల్ గా ఏ హడావిడా లేకుండా కనిపిస్తాయి. ఇక ఇప్పుడు భళాతందనాన సినిమాలోని పాట కూడా అంతే మెలోడియస్ వింటున్న కొద్దీ హాయిగా అనిపిస్తూ ఉంది.
శ్రీమణి రాసిన ఈ గీతాన్ని రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి సంయుక్తంగా ఆలపించారు. అయితే రెండు డిఫరెంట్ మాంటేజెస్ లో ఇద్దరు వ్యక్తుల ఆలోచనా విధాల్లో సాగే పాటలా కనిపిస్తోంది. ముఖ్యంగా పల్లవిలోని సాహిత్యం వినగానే చాలా రోజులకు మంచి పదాలు విన్న ఫీలింగ్ కలుగుతుంది.
‘‘రాశానిలా కనబడని వినబడనీ ప్రేమలేఖ.. చూశానిలా.. కదలననే.. వదలననే మౌనరేఖ.. ’’ అంటూ శ్రీమణి మంచి సాహిత్యాన్ని అందించాడు. రమ్యబెహ్రా, అనురాగ్ కూడా చాలా ఇష్టంగా పాడారా అనిపిస్తుంది వింటుంటే.. ఏదేమైనా ఈ మధ్య కాలంలో వచ్చిన మరో బెస్ట్ మెలోడియస్ సాంగ్ గా నిలుస్తుందీ గీతం అని చెప్పొచ్చు.

Related Posts