కొడుకుతో కండోమ్స్ కొనిపిస్తోన్న నిర్మాత

డిఫరెంట్ కంటెంట్.. ఈ మాట వినడానికి బానే ఉంటుంది. కానీ చూసేటప్పుడే అది ఎంత ‘డిఫరెంట్’అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు యూత్ ఫుల్ సబ్జెక్ట్స్ అంటూ వస్తారు. చూస్తే అవి బూతుఫుల్ గా ఉంటాయి. అలాగని వాటిని తక్కువ చేయడం కాదు. కొన్ని బూతు చిత్రాల్లో కూడా నీతి ఉంటుంది. ఎటొచ్చీ బూతు శ్రుతి మించితేనే.. రోతగా మారుతుంది. ఇప్పుడీ బూతు పురాణం అంతా ఎందుకు అంటారా.. ఉందీ.. తెలుగులో కాస్త మంచి సినిమాలే తీసిన నిర్మాత ఇప్పుడు తన కొడుకును హీరోగా నిలబెట్టేందుకు ఇలాంటి యూ(బూ)తుఫుల్ సబ్జెక్ట్ తోనే వస్తున్నాడు. ఆ నిర్మాత ఎవరో ఇప్పటికే గెస్ చేసి ఉంటారు కదా..?
తెలుగులో ఎవడిగోల వాడిది, స్టైల్, స్నేహగీతం, పోటుగాడు వంటి సినిమాలు నిర్మించిన లగడపాటి శ్రీధర్ గుర్తున్నాడు కదా.. కొన్నాళ్లుగా ఆయన తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. చివరగా అల్లు అర్జున్ తో నిర్మించిన నా పేరు సూర్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈచిత్రంలో నటించిన అతని కొడుకు విక్రమ్ సహిదేవ్ కు మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో అతన్ని హీరోను చేశాడు శ్రీధర్. విక్రమ్ హీరోగా ఆ మధ్య ఓ సినిమా వచ్చింది. కానీ ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ సారి యూత్ ఫుల్ కంటెంట్ ను నమ్ముకున్నట్టున్నాడు. ‘వర్జిన్ స్టోరీ’ అనే సినిమాతో కొడుకును హీరోగా రీ లాంచ్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ చూస్తోంటేనే ఇది కూడా రెగ్యులర్ యూత్ ఫుల్ సినిమాలా కనిపిస్తోంది. ‘ఫస్ట్ సెక్స్ ఎక్స్ పీరియన్స్’కోసం తాపత్రయపడే కథలా కనిపిస్తోంది. ఇంకా టీనేజ్ కూడా దాటని అమ్మాయిలా కనిపిస్తోన్న హీరోయిన్ అప్పటికే మూడు సార్లు బ్రేకప్ అయి ఉంటుంది. ఆ తర్వాత హీరో తారసపడతాడు. అతనితో ఏకంగా సెక్స్ ఎక్స్ పీరియన్స్ కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ట్రైలర్ చివర్లో హీరోను ‘సేఫ్టీకి ఏమైనా తెస్తున్నావా’ అని అడుగుతుంది.. అందుకు అతను ‘ఏదైనా ఫ్లేవర్ కావాలా’ అని అడుగుతాడు. దీనికి ఆమె ఏదైనా ఓకే అంటుంది. ఇదీ వరస.. అలాగే ఈ చివరి డైలాగ్స్ మాత్రమే ఇలా ఉన్నాయని కాదు.. ట్రైలర్ అంతా ముద్దులు, హగ్గులు తప్ప ఇంకేం లేదు. మరి కాస్త పేరున్న సినిమాలే నిర్మించిన శ్రీధర్ ఇలా తన కొడుకు మరీ బీ గ్రేడ్ హీరోలా పరిచయం చేయడం అవసరమా.. అనే విమర్శలూ వస్తున్నాయి. ఏమోలే.. ఈ కథ ఆకట్టుకుంటే ఆ తర్వాత ఇలాంటి కథలే కంటిన్యూ అయినా ఆశ్చర్యం లేదు.

Related Posts