‘భజే వాయు వేగం‘ టీజర్.. రేసీ ఎమోషనల్ ఎంటర్ టైనర్

రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ లో చాలా మూవీస్ వచ్చాయి. అలాంటి రేసింగ్ సీక్వెన్సెస్ తో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెలుగులో రాబోతుంది ‘భజే వాయు వేగం‘. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. కార్తికేయ కి జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. ఇటీవలే టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోతో అలరించిన ‘భజే వాయు వేగం‘ నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి ‘భజే వాయు వేగం‘ టీజర్ ను విడుదల చేశారు. ‘డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు.. అంటూ కొన్ని యాక్షన్ విజువల్స్ తో మొదలైన టీజర్ లో.. ‘ప్రతీ ఒక్కడి లైఫ్ లో ఒకడుంటాడు.. వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకాడం.. నా లైఫ్ లో అది మా నాన్న..‘

అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్ హైలైట్ గా ఉంది. ఓ రేసీ, పేసీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ‘భజే వాయు వేగం‘ రాబోతుందంటూ చెబుతోంది నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. త్వరలోనే ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts