నాని ముందు సినిమా రానీయ్..తర్వాత డైలాగులు

మా సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకూ ఇలాంటి సినిమాలే రాలేదు.. చూస్తే ఖచ్చితంగా మీరు మరో లోకంలోకి వెళ్లిపోతారు.. ఇదీ ఓ తరహా సినిమా ప్రమోషన్. లేదూ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల పేర్లు చెబుతూ.. మా సినిమా ఆ మూవీస్ రేంజ్ లో ఉంటుంది అని చెప్పడం మరో తరహా ప్రమోషన్. నిజానికి ఈ రెండూ జనం నమ్మడం మానేసి చాలాకాలం అయింది.

అయితే రెండో అంశం మాత్రం సెటైర్స్ కు ఆస్కారం కలిగిస్తుంది. అంటే ఆ రేంజ్ లో మీ సినిమా ఉంటుందా అంటూ కమెంట్స్ చేస్తారు.. తేడా వస్తే ఆ తర్వాత ట్రోలింగ్స్ తో ఆడేసుకుంటారు. ఇప్పుడు నాని విషయంలో జరుగుతున్నది ఇదే.


నేచురల్ స్టార్ నాని.. రూట్ మారుస్తున్నాడు. క్లాస్ నుంచి ఊరమాస్ గెటప్స్ లోకి వెళ్లిపోతున్నాడు. వైవిధ్యమైన కథలు అంటూ రూరల్ బ్యాక్ డ్రాప్ లోకి వెల్లిపోయాడు. ఏకంగా సింగరేణి బొగ్గును ఒళ్లంతా పూసుకుని.. సరికొత్త పాత్ర చేస్తున్నా అనే కలరింగ్ ఇచ్చాడు. ఫస్ట్ లుక్ నుంచే ఈ మూవీపై అంచనాలున్నాయి. నాని నమ్మకంపై జనం హోప్స్ పెట్టుకున్నారు. నానికి దసరా మూవీ ఖచ్చితంగా కొత్త ఇమేజ్ తెస్తుందని అనుకుంటున్నారు.

అదే టైమ్ లో అతను కోరుకుంటున్నట్టుగా పక్కింటి అబ్బాయి తరహా ఇమేజ్ ను కూడా మారుస్తుందనే టాక్ ఉంది. ఇక ఈ మూవీ టీజర్ తో పాటు ఇప్పటి వరకూ వచ్చి రెండు పాటలూ అంచనాలూ పెంచాయి. ఇంకా హీరోయిన్ కీర్తి సురేష్ కు సంబంధించిన అంశాలేవీ రివీల్ చేయలేదు. మరో ప్రధాన పాత్ర చేస్తోన్న కుర్రాడి గురించిన అప్డేట్ లేదు. అలాగే ట్రైలర్ ఇంకా రావాల్సి ఉంది.

అయినా సినిమాపై అంచనాలు పెంచడంలో మూవీ టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న ఈ చిత్రంతో అతను తెలుగులో టాప్ డైరెక్టర్ అవుతాడుఅనే జతకాలు కూడా చెబుతున్నారు చాలామంది. ఇప్పటి వరకూ బానే ఉన్నా.. రీసెంట్ గా నాని తన సినిమాను ఓ కెజీఎఫ్‌, పుష్ప, కాంతార, ఆర్ఆర్ఆర్ రేంజ్ సినిమాలతో పోల్చాడు. దీంతో అసలే సోషల్ మీడియాలో ఖాళీగా ఉండే బ్యాచ్ అంతా ఓ రేంజ్ లో సెటైర్స్ వేయడం మొదలుపెట్టారు.

లుక్కో, మేకోవరో అలా కనిపించినంత మాత్రాన ఇక ఆ చిత్రాలతో పోల్చుకోవడమేనా.. రిలీజ్ తర్వాత ఈ విషయాన్ని జనం మాట్లాడుకోవాలి కానీ మీరే చెప్పుకుంటే ఎలా అంటూ సెటైర్స్ మొదలుపెట్టారు. పైగా కాంతార విషయంలో చాలామంది హర్ట్ అయ్యారు. కేవలం 18 కోట్లతో తీసిన ఈ సినిమా 400 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. ఇటు దసరా ఇప్పటికే యాభై కోట్లకు పైగా పెట్టారు. అయినా ఎలా కంపేర్ చేస్తారు అంటున్నారు. ఏదేమైనా నాని తన సినిమాపై నమ్మకంతో చెప్పి ఉండొచ్చు కాక.. కానీ అందుకోసం ఇలాంటి ఎపిక్ మూవీస్ ను ఎగ్జాంపుల్ గా చెప్పి ఉండకూడదు అంటున్నారు సన్నిహితులు. అయినా నాని ఇలాంటి బిల్డప్పులు కాదు.. నిజంగా సత్తా చాటాలి. అప్పుడే ఇలాంటి సెటైర్స్ తగ్గుతాయి.

Telugu 70mm

Recent Posts

మరోసారి హాలీవుడ్ కి వెళుతున్న టబు

రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచిన హైదరాబాదీ బ్యూటీ టబు. మూడు దశాబ్దాల క్రితం వెంకటేష్ 'కూలీ నంబర్…

8 mins ago

విజయ్ సినిమాలకు హీరోయిన్స్ సెట్..!

రౌడీ స్టార్ విజయ్ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలతో బిజీ అయ్యాడు. వీటిలో ఒకటి గౌతమ్ తిన్ననూరితో కాగా.. మరో…

41 mins ago

సూపర్ హీరోతో ఫిక్సైన పూరి జగన్నాథ్

టాలీవుడ్ లో జెట్ స్పీడులో సినిమాలను పూర్తి చేసే డైరెక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చేది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.…

3 hours ago

ఈవారం చిన్న సినిమాలదే హవా

ఎన్నికల వేడి చల్లారింది. జనం అంతా ఇప్పుడు ఎంటర్‌టైన్ మెంట్ మూడ్ లో ఉన్నారు. కాలక్షేపం కోసం కొత్త సినిమాల…

3 hours ago

ఎన్నికలు పూర్తయ్యాయి.. ఇక సినిమాలపైనే ఆ ఇద్దరి ఫోకస్..!

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి చల్లారింది. జూన్ 4న రిజల్ట్స్ వచ్చే వరకూ ఫలితాలపై టెన్షన్ కొనసాగుతోంది. కానీ.. ఈలోపులో…

4 hours ago

‘పుష్ప 2’ కోసం డేట్స్ కేటాయించిన ఫహాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ 'పుష్ప 2'. ఇండిపెండెన్స్‌ డే స్పెషల్ గా ఆగస్టు 15న ఈ…

4 hours ago