బీస్ట్ పాటకు బేబమ్మ బెల్లీ డ్యాన్స్

‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ గా అవతరించింది కన్నడ కస్తూరి కృతి శెట్టి. ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు’ వంటి వరుస విజయాలందుకుని అగ్ర పథానికి దూసుకెళ్లింది. కానీ.. ఎంత తొందరగా తారాపథంలోకి వెళ్లిందో.. అంతే త్వరగా వరుస ఫ్లాపులతో సతమతమయ్యింది. ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ తో ఒక చిత్రం చేస్తోన్న ఈ బ్యూటీ.. తమిళంలో మాత్రం రెండు, మూడు ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే కృతి.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ తో పాటు డ్యాన్స్ వీడియోస్ ను షేర్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా కృతి చేసిన ఇన్ స్టా రీల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘బీస్ట్’ మూవీలోని హలమితి హబీబో పాటకు కృతి వేసిన బెల్లీ డ్యాన్స్ స్టెప్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి.

Related Posts