మెగాస్టార్, రెబెల్ స్టార్ చిత్రాల్లో మృణాల్

బుల్లితెర నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి.. వెండితెరపై కథానాయికగా వెలుగులు విరజిమ్ముతున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తుంపు.. తెలుగు సినిమా ‘సీతారామం‘తో దక్కించుకుంది. ఈ పీరియాడ్ మూవీలో సీతగా సినీ ప్రేమికుల మదిలో చెరగని ముద్ర వేసింది.

‘సీతారామం‘ తర్వాత మృణాల్ ఠాకూర్ కి సౌత్ నుంచి ఆఫర్ల వెల్లువ మొదలైంది. అయితే.. సెలక్టివ్ గా మాత్రమే ముందుకు వెళుతున్న ఈ సిల్వర్ స్క్రీన్ సీత.. ‘హాయ్ నాన్న’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’తో ముచ్చటగా మూడో విజయాన్ని అందుకునేందుకు సిద్ధమవుతోంది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతుంది. మరోవైపు.. తనకు హిందీ కంటే తెలుగులోనే మంచి పాత్రలు వస్తున్నాయని బాహటంగా చెప్పేసింది టీమ్.

ఇప్పుడు తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో మృణాల్ కనిపించబోతుందనే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఒకటి ప్రభాస్ ‘కల్కి’ కాగా.. మరొకటి మెగాస్టార్ ‘విశ్వంభర’. ‘కల్కి’లో శ్రీకృష్ణుడు ప్రేయసి రాధ పాత్రలో మృణాల్ అతిథిగా అలరించనుందట. అలాగే.. చిరంజీవి ‘విశ్వంభర’లోనూ మృణాల్ నటిస్తుందనేది టాలీవుడ్ టాక్. మొత్తంమీద.. తెలుగులో మృణాల్ కొత్త కమిట్ మెంట్స్ పై త్వరలో ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి.

Related Posts