ఆసక్తికర దొంగతనాలతో చౌర్య పాఠం టీజర్‌

రవితేజ ధమాకా తో సూపర్‌డూపర్ హిట్ సాధించిన నక్కిన త్రినాధరావు.. ఇప్పుడు నక్కిన నేరేటివ్స్ బ్యానర్‌పై చౌర్య పాఠం అనే సినిమా నిర్మించారు. ఇంద్రరామ్‌ హీరోగా నిఖిల్‌ గొల్లమారి డైరెక్షన్‌లో ఈ సినిమా ను నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ , టీజర్‌ లాంచ్‌ చేసారు. ఈ సినిమాలో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందనేలా ఈ టీజర్‌ ను కట్‌ చేసారు.


డాక్యుమెంటరీలు తీసే బ్యాచ్‌ గా ఎంటరయి.. ఊర్లో దొంగతనాలు చేసేలా హీరో ప్లాన్ చేసే విధానం కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతుందనేలా ఉందీ సినిమా.
రీసెంట్ హిట్ ఈగల్‌కు డైరెక్ట్‌ చేసిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి కథ అందించారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. పాయల్‌ రాధాకృష్ణ ఈ సినిమాకి కథానాయక.


నక్కిన నేరేటివ్స్ బ్యానర్‌ చౌర్య పాఠంతో ప్రారంభమైనందున ఆశీర్వదించడానికి వచ్చిన దర్శక నిర్మాతలు, శ్రేయోభిలాషులు, స్నేహితులందరికీ థ్యాంక్స్ చెప్పారు నక్కిన త్రినాధరావు. మిగతా యూనిట్ సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts