బ్యూటీఫుల్ మెలోడియస్ గా ఖుషీ మూవీ సాంగ్

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ గా ఖుషీ మూవీ నుంచి ఓ బ్యూటీఫుల్ మెలోడియస్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్.

శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. వాటిని రెట్టింపు చేసేలా విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ సాంగ్ కనిపిస్తోంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తనే పాడాడు.


ఈ గీతాన్ని దర్శకుడు శివ నిర్వాణ రాయడం ఓ విశేషమైతే.. ” నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే” అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం. ‘నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే.. నీ అమృపు జడిలో ఓ ఘర్షణే మొదలైంది.. “, నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా.. నీ గుండె సడి లయలో.. నే మారనా నీ ప్రతిధ్వనిగా.. “ అంటూ మంచి సాహిత్యం కూడా ఈ పాటలో కనిపిస్తోంది.


ఏ సినిమా నుంచి అయినా మొదటి పాట వస్తోందంటే అది ఆ మూవీ ఫ్లేవర్ ను తెలియజేస్తుంది. ఖుషీ నుంచి వచ్చిన ఈ గీతం కూడా ఓ ప్లెజెంట్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అనేలా కనిపిస్తోంది. శివ నిర్వాణే నృత్యరీతులు సమకూర్చిన ఈ గీతాన్ని కశ్మీర్ లోని అందమైన లొకేషన్స్‌ లో చిత్రీకరించారు.

సమంత ఓ కశ్మీరి యువతిగా కనిపిస్తోంది. తన ప్రేమను గెలుచుకునే యువకుడుగా విజయ్ నటించాడు. వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని పాట చూస్తే అర్థమౌతోంది. ఫస్ట్ సాంగ్ తోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసిన ఖుషీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషలతో పాటు హిందీలోనూ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.

Telugu 70mm

Recent Posts

హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు…

8 hours ago

జపాన్ లోనూ అదరగొడుతున్న మనోళ్లు

ఒకప్పుడు జపాన్ లో బాగా తెలిసిన ఇండియన్ యాక్టర్ అంటే రజనీకాంత్ అని చెప్పాలి. రజనీకాంత్ నటించిన 'ముత్తు' చిత్రం…

9 hours ago

ఉత్తరాదిని మరోసారి ఊపేయనున్న ‘ఆర్.ఆర్.ఆర్‘

సమ్మర్.. సినిమాలకు అతిపెద్ద సీజన్. అయితే.. ఈ ఏడాది వేసవి చాలా డల్ గా సాగుతోంది. ఒకవైపు పెద్ద సినిమాలు…

10 hours ago

‘ఆ… ఒక్కటీ అడక్కు‘.. మొదటి రోజు కంటే మిన్నగా రెండో రోజు వసూళ్లు

ఈ వారం థియేటర్లలోకి వచ్చిన చిత్రాల్లో అల్లరి నరేష్ ‘ఆ… ఒక్కటీ అడక్కు‘ ఒకటి. రాజేంద్రప్రసాద్ సూపర్ హిట్ మూవీ…

10 hours ago

‘రాజు యాదవ్‘ ట్రైలర్.. నవ్వు ముఖంతో గెటప్ శ్రీను ప్రయోగం

‘జబర్దస్త్‘ ప్రోగ్రామ్ లో వెరైటీ గెటప్స్ తో ఆడియన్స్ ను అలరించే గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు…

10 hours ago