‘బనారస్’ లో ఎక్స్ ట్రార్డినరీ కంటెంట్ వుంది..

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్  సోనాల్ మోంటెరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘బనారస్’  విడుదలకు ఇంకా నాలుగు రోజులే వుంది,, ఎలా అనిపిస్తుంది ?

ఎక్సయిట్ మెంట్, నేర్వస్నెస్.. రెండూ వున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ. అన్ని పరిశ్రమలకు ఈ సినిమాతో పరిచయం కావడం ఎక్సయిటింగ్ గా అదే సమయంలో నెర్వస్ గా కూడా వుంది. ప్రేక్షకులు తప్పకుండా బనారస్ చిత్రాన్ని ఇష్టపడతారనే నమ్మకం వుంది.

పాన్ ఇండియాకి మీరు కొత్త .. ప్రమోషన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?

కన్నడ ఎనిమిది సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. హిందీ, తెలుగు పరిశ్రమల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మా నమ్మకాన్ని పెంచింది. 

ట్రైలర్ లో టైం ట్రావెల్, ప్రేమ కథ కనిపించాయి.. ఇంతకీ బనారస్ జోనర్ ఏమిటి ?

టైం ట్రావెల్ కథలో చిన్న భాగం మాత్రమే. లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది. బనారస్ ని అద్భుతంగా చూపించాం. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అసాదారణమైన స్క్రిప్ట్ ఇది.  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

బనారస్ లో మీ పాత్ర ప్రాధన్యత ఎలా వుంటుంది ?

జయతీర్ధ గారి సినిమాల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధన్యత వుంటుంది. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకమైనది. ఇందులో ధని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోకి ఎంత ప్రాధన్యత వుంటుందో  హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత వున్న కథ ఇది.

కాంతార లాంటి విజయం తర్వాత కన్నడ నుండి వస్తున్న చిత్రం బనారస్.. ఎలా అనిపిస్తుంది ?

కాంతార విషయంలో నేను చాలా ఆనందంగా, గర్వంగా వున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని చెప్పారు. అయితే బనారస్ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జోనర్స్ వేరు. కాంతారని ఇష్టపడినట్లే బనారస్ ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది.

మీకు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి కదా.. చేయకపోవడానికి కారణం ?

నా ద్రుష్టి సౌత్ పై వుంది. తులులో నా కెరీర్ ప్రారంభించాను. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనేవరో ఇక్కడవారికి తెలుసు. నాకంటూ ఒక పేరు వచ్చింది. వేరే పరిశ్రమలోకి డైరెక్ట్ గా  జంప్ చేసేయడం ఇష్టం వుండదు. అందులోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్ కంటే అద్భుతంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. తెలుగులో రాబర్ట్ సినిమాలో ఒక క్యామియో చేశా. తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వుంది.

తెలుగు సినిమాలు చూస్తారా ? తెలుగు పరిశ్రమలో నచ్చిన అంశం ఏమిటి ?

తెలుగు భాష అర్ధమౌతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే నా సినిమాలు షూటింగ్ జరుపుకుంటాయి. చక్కని నటన కనబరిస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. సీతారామం, ఆర్ఆర్ఆర్ , పుష్ప సినిమాలు తెలుగులోనే చూశా. విజయ దేవరకొండ అంటే ఇష్టం.

జైద్ ఖాన్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

జైద్ పొలిటికల్ నేపధ్యం నుండి వచ్చారు. ఆయన ఎలా వుంటారోఅనిపించేది. అయితే జైద్ నా ఆలోచనలు తప్పని నిరూపించారు. జైద్ వండర్ ఫుల్ పర్శన్. మంచి ఫెర్ ఫార్మర్. చాలా సపోర్ట్ చేస్తారు. ట్రైలర్ చూస్తే చాలా అనుభవం వున్న నటుడిలానే కనిపిస్తారు తప్పితే కొత్త నటుడనే భావన రాదు.

కొత్తగా చేయబోతున్నా సినిమాలు ?

మూడు కన్నడ సినిమాలు చేస్తున్నా. అలాగే సరోజినీ నాయుడు బయోపిక్ చేస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.

Telugu 70mm

Recent Posts

పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప 2’ ప్రభంజనం

'పుష్ప 2' మ్యూజికల్ జర్నీ ఇటీవలే మొదలైంది. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'పుష్ప పుష్ప'…

2 hours ago

Mollywood Blockbusters Are Coming To OTT

Four blockbusters have come out of Malayalam in a very short time like never before.…

2 hours ago

Nara Rohit’s ‘Prathinidhi 2’ to release on May 10

Politics in Telugu states has become more heated now. At such a time, the original…

17 hours ago

New schedule of ‘Double Ismart’ started in Mumbai

Dashing Puri Jagannadh and Ustad Ram's combo 'Ismart Shankar' became a super duper hit. Now…

17 hours ago

మాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి

గతంలో ఎప్పుడూ లేనివిధంగా మలయాళం నుంచి చాలా తక్కువ సమయంలో నాలుగు బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. ఆ చిత్రాలే 'ప్రేమలు, ది…

17 hours ago

మే 10న రాబోతున్న నారా రోహిత్ ‘ప్రతినిధి 2’

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి…

17 hours ago