టైర్ టూ లో టాప్ హీరోయిన్ ఎవరు..?

టాప్ ప్లేస్ లోకి వెళతారు అని ఖచ్చితంగా చెప్పలేం కానీ.. టైర్ టూ లో మాత్రం టాప్ అనిపించుకునే ఛాన్స్ ఉన్న భామలూ ఉన్నారు. వీళ్లు ఇప్పుడిప్పుడే టాలీవుడ్ తో పాటు ప్రేక్షకుల్లో రిజిస్టర్ అవుతున్నవారు. అందుకే కొంత టైమ్ పట్టొచ్చు కానీ.. కొత్త మొహాలుగా ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని హంగులూ వీరికి ఉన్నాయి. ఆ లిస్ట్ లో ఉన్న భామ నేహా శెట్టి. డిజే టిల్లుతో ఫేమ్ అయిన నేహా అంతకు ముందే తెలుగుతో మెహబూబా అనే సినిమాతో పరిచయం అయింది.
నేహాశెట్టి కూడా కన్నడ సోయగమే. 2018లోనే మెహబూబా మూవీతో పరిచయం అయింది. ఆ మూవీ ఫ్లాప్ అయినా తర్వాత గల్లీ రౌడీ అనే సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇదీ పోయింది. అయినా అనుకోకుండా వచ్చిన డిజే టిల్లు తన కెరీర్ ను నిలబెట్టింది. ఆడియన్స్ లో బలంగా రిజిస్టర్ అయ్యేలా చేసింది. తన ఒరిజినల్ పేరు కంటే ఈ మూవీలోని పేరుతోనే ఎక్కువ ఫేమ్ అయిన నేహా ఇప్పుడు కార్తికేయతో ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ తన ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు.హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసి తెలుగు తెరకు పరిచయమైన మరో బ్యూటీ కేతిక శర్మ. రొమాంటిక్ మూవీ విజయంలో తనే కీలకం అని చెప్పొచ్చు. ప్రస్తుతం రంగ రంగ వైభవంగా సినిమాతో రాబోతోంది. తర్వాత సాయితేజ్ సరసన మరో మూవీకి ఓకే చెప్పింది. తన ఛరిష్మాను బట్టి చూస్తే ఎప్పుడో స్టార్ రేస్ లోకి రావాల్సిన బ్యూటీ అనిపిస్తుంది. కానీ ఎందుకో అమ్మడి కెరీర్ కాస్త స్లోగా నడుస్తోంది.

మరి వైష్ణవ్ తేజ్ సరసన నటిస్తోన్న ఈ రంగ రంగ వైభవం అయినా తన కెరీర్ కు కొత్త వైభవం తెస్తుందేమో చూడాలి.ఈ లిస్ట్ లోకి వస్తారా లేదా అనేది చెప్పలేం కానీ ఇప్పుడు మరికొందరు భామలు తెలుగులో తమ లక్ చెక్ చేసుకుంటున్నారు. వారిలో రామారావు ఆన్ డ్యూటీలో నటిస్తోన్న ఇద్దరు బ్యూటీస్ ఉన్నారు. దిశ్యాంశ కౌశిక్, రజీషా విజయన్. వీరిలో దివ్వాంశ ఇంతకు ముందే తెలుగులో మజిలీ సినిమా చేసి ఉంది. తను బాగా నటించింది. అయితే క్రెడిట్ మొత్తం సమంత, నాగచైతన్యకు వెళ్లిపోవడంతో అమ్మడిని తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ కు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రామారావుతో కలిసి మరో ప్రయత్నం చేస్తోంది.దివ్యాంశకు ఇది సెకండ్ ఛాన్స్. రామారావు హిట్ అయితే తనకు టాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతాయి. ఇక ఇదే సినిమాతో తనతో పాటు పరచయం అవుతోంది రజీషా విజయన్. మళయాలీ బ్యూటీ అయిన రజీషా ఆ మధ్య తమిళ్ లో ధనుష్ సరసన కర్ణన్ అనే సినిమాతో ఆకట్టుకుంది. ఇది తన ఫస్ట్ తెలుగు మూవీ. ఇప్పటికే మంచి పర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్న రజీషాకు రామారావు ఎలాంటి ప్లాట్ ఫామ్ అవుతుందో చూడాలి.మళయాలంలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ లో రానా భార్యగా నటించింది. ఈ పాత్ర చూసి చాలామంది తను హీరోయిన్ మెటీరియల్ కాదు అనుకున్నారు. బట్ తనుతెలుగులో ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తోంది. కళ్యాణ్‌ రామ్ తో చేసిన బింబిసార ఆగస్ట్ 5న విడుదల కాబోతోంది. అలాగే ధనుష్ ఫస్ట్ తెలుగు మూవీ సర్ లోనూ తనే హీరోయిన్. ఈ రెండు సినిమాలూ విజయం సాధిస్తే.. సంయుక్త కూడా సరికొత్త హీరోయిన్ గా తెలుగు వారిని అలరిస్తుంది. మొత్తంగా టాప్ ప్లేస్ లోకి వెళ్లే బ్యూటీస్ తో పాటు టైర్ టూ రేస్ లో టాప్ లేపే భామలుగా వీరితో పాటు ఇంకా చాలామందే ఉన్నారు. వీరిలో కొందరు ప్లేస్ లు మారినా ఆశ్చర్యం లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ అందమైన భామలు చేయబోయే సంచలనాలేంటనేది కాలమే చెబుతుంది.

Related Posts