తెలంగాణ పెళ్లి నేపథ్యంలో రూపొందుతోన్న ‘లగ్గం’

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు వంటి వారు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ‘లగ్గం’. సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి రమేశ్ చెప్పాల దర్శకుడు. ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ముఖ్యంగా.. తెలంగాణ పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారట.

ఈ కల్చరర్ ఫ్యామిలీ డ్రామా కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. కామారెడ్డి, జనగామ, బీబీపేట ఇస్సానగర్ ప్రాంతాల్లో.. పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో వేసిన సెట్స్ మధ్య ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందట. ఏప్రిల్ 11 నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఉగాది కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

Related Posts