‘అయలాన్’ ట్రైలర్.. భూమిని కాపాడడానికి వచ్చిన ఏలియన్

కొంతమంది తమిళ నటులకు తెలుగులోనూ మంచి స్టార్ డమ్ ఉంది. అలాంటి వారిలో శివకార్తికేయన్ ఒకడు. ఈ కోలీవుడ్ స్టార్ నటించిన పలు చిత్రాలు తెలుగులో అనువాద రూపంలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. లేటెస్ట్ గా ‘అయలాన్’ సినిమాతో అటు తమిళం, ఇటు తెలుగులో పొంగల్ బరిలో పోటీకి సిద్ధమవుతున్నాడు శివకార్తికేయన్.

ఏలియన్ కాన్సెప్ట్ తో వైవిధ్యంగా ‘అయలాన్‘ రూపొందింది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆర్.రవికుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. భూమికి విఘాతం కలిగించే సందర్భం రావడం.. ఆ సమయంలో ఏలియన్ కూడా భూమిని కాపాడడానికి తనవంతు కృషి చేయడం వంటి సన్నివేశాలు ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ట్రైలర్ ఆద్యంతం విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. విలన్ గా శరద్ కేల్కర్ కనిపించబోతున్నాడు. ఇంకా.. ఇతర ప్రధాన పాత్రల్లో ఇషా కొప్పికర్, యోగిబాబు, భానుప్రియ నటించారు.

ఈ సినిమాలో ఏలియన్ కి సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. జనవరి 12న తమిళం, తెలుగు భాషల్లో ‘అయలాన్’ విడుదలకు ముస్తాబవుతోంది. మొత్తంమీద.. ట్రైలర్ తో సరికొత్త సినిమా అనే భావన కలిగించిన ‘అయలాన్’.. సంక్రాంతి బరిలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Related Posts