‘గుంటూరు కారం’ ప్రీ-రిలీజ్ వాయిదా

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జనవరి 6న జరగాల్సి ఉంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుక కోసం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ ను వేదిక గా ప్రకటించారు. ప్రీ-రిలీజ్ వేడుక కోసం అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈ వేడుకను వాయిదా వేశారు మేకర్స్. అసలు కారణం ఏంటంటే.. ‘గుంటూరు కారం’ ప్రీ-రిలీజ్ వేడుకకు సూపర్ స్టార్ అభిమానులు వేలాది గా వస్తారు. ఈనేపథ్యంలో సెక్యురిటీ ప్రాబ్లమ్ వస్తోంది. అందుకే.. ఈ వేడుకకు పర్మిషన్ రాలేదట. దీంతో.. మళ్లీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటించనున్నట్టు చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Related Posts