దసరా కానుకగా ‘దేవర’.. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోస్టర్ తో రిలీజ్ డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘దేవర’ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ లో వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. రిలీజ్ డేట్ తో ‘దేవర’గా ఎన్టీఆర్ పవర్ ఫుల్ లుక్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో ఏదో యుద్ధానికి సిద్ధపడుతున్నట్టున్న తారక్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది.

ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎంతో ప్రెస్టేజియస్ గా ‘దేవర’ సినిమా రూపొందుతోంది. రెండు భాగాలుగా కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. మరో నాయికగా మరాఠీ భామ శృతి మరాఠేని ఎంపిక చేసినట్టు ప్రచారమయ్యింది. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ మూవీకి టెక్నికల్ ఫ్రంట్ లో మరింత ప్లస్ కానున్నాయి.

Related Posts