‘ఆ… ఒక్కటీ అడక్కు’ అంటోన్న అల్లరి నరేష్

‘ఆ.. ఒక్కటీ అడక్కు’ ముఫ్ఫై ఏళ్ల క్రితం ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన సినిమా ఇది. సూపర్ డూపర్ హిట్టైన ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ టైటిల్ నే అల్లరి నరేష్ కొత్త చిత్రానికి ఖరారు చేశారు. మల్లీ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది టీమ్. అందరూ పెళ్లెప్పుడూ? పెళ్లెప్పుడూ? అంటూ అన్ని భాషల్లోనూ అడుగుతుంటే.. ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ అంటూ అల్లరి నరేష్ చెప్పే సమాధానంతో ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కి జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మార్చి 22న ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ ఆడియన్స్ ముందుకొస్తుంది.

Related Posts