తెరపై తండ్రీ కూతురిగా

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా శేఖర్. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు.‌ వెండితెర పై తండ్రి తనయ కలిసి కనిపించనున్న తొలి చిత్రమిదే. ఈ చిత్రానికి జీవితా రాశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. ఈ రోజు సినిమా యూనిట్ రాజశేఖర్, శివానీ రాజశేఖర్ స్టిల్స్ విడుదల చేసింది.

ఇది హీరోగా రాజశేఖర్ 91వ సినిమా. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రావాలి అనుకున్నప్ప‌టికీ కొన్ని కార‌ణావ‌ల వల‌న వాయిదా వేశారు. ఈ సినిమా విడుద‌ల తేదీ త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా దర్శకురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ…రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో… సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫస్ట్ గ్లింప్స్, లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుత స్పందన లభించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామ‌ని చెప్పారు.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

9 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

13 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

14 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

16 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

17 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

19 hours ago