అవి పెయిడ్ ప్రమోషన్సా పుష్పా..?

ప్రమోషన్లు పలురకాలు. కొందరు బాధ్యతగా చేస్తారు. మరికొందరు నిజంగా నచ్చితే చేస్తారు. ఇంకొందరు పైసలు తీసుకుని ప్రమోషన్స్ చేస్తుంటారు. బాధ్యతగా చేసేది సినమా తీసినవాళ్లు. నచ్చి మెచ్చేవారు సినిమా చూసినవాళ్లు. మరి పైసలు తీసుకుని చేసేది ఎవరు..? ఇంకెవరు సెలబ్రిటీస్. ఏదో రకంగా సమాజంలో సెలబ్రిటీస్ గా ఉన్నవాళ్లతో ప్రమోషన్స్ చేయించే పని కూడా సినిమా తీసినవాళ్లో, కొన్నవాళ్లో చేయిస్తుంటారు. ఇప్పుడు పుష్పకు సంబంధించి జరుగుతోన్న ప్రమోషన్ ఈ రెండోవాళ్లు చేయిస్తోన్నదనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. యస్.. ప్రస్తుతం తెలుగు స్టేట్స్ నుంచి యూనైటైడె స్టేట్స్ వరకూ పుష్ప మేనియా కనిపిస్తోంది. ప్రధానంగా టాప్ సెలబ్రిటీస్ అంతా పుష్ప పాటలకు స్టెప్పులు వేస్తూ ఓ ఇది చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా క్రికెటర్ వార్నర్ మాత్రమే ఎప్పట్లానే ‘ఫ్రీ’గా స్టెప్పులు వేశాడు. అయితే మిగిలిన క్రికెటర్స్ అంతా ‘పెయిడ్ స్టెప్స్’వేస్తున్నారట. అంటే.. పుష్ప సినిమాకు పైకం తీసుకుని ప్రమోషన్ చేస్తున్నారన్నమాట.
మరి ఈ డబ్బులు ఎవరిస్తున్నారు అంటే.. ఇంకెవరు.. ఈ మూవీని కొన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్. యస్.. కాస్త చిత్రంగా ఉన్నా ఇదే నిజం అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వాళ్లు.. క్రికెటర్స్ తో పాటు ఇతర సెలబ్రిటీస్ అందరికీ తమ సినిమాకు కాస్త టైమ్ కేటాయించి చిన్న ప్రమోషనల్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని.. అందుకు ఇంత డబ్బు ఇస్తామని ఒప్పందం చేసుకుని మరీ ప్రమోట్ చేయిస్తోందట. ఆ కారణంగానే పుష్ప ను అమెజాన్ లో చాలామంది సెలబ్రిటీస్ చూసి అహో ఒహో అంటూ తెగ పొగిడేస్తున్నారు.
నిజానికి ఈ ట్రెండ్ సినిమావాళ్లలో లేదు. ఏదైనా ఉంటే కాస్త పరిచయాలతో అప్పుడప్పుడూ తమ చిత్రాల గురించి మళ్లీ సినిమా స్టార్స్ తోనే ప్రమోషన్ చేయించారు కానీ ఇలా టాప్ సెలబ్రిటీస్ కు డబ్బులు ఇచ్చి మరీ ప్రమోట్ చేయించడం అనేది కార్పోరేట్ ట్రెండ్ గానే చూడాలి. నిజంగా ఇలా చేస్తే రాబోయే రోజుల్లో యావరేజ్ సినిమాలను కూడా ఈ సెలబ్రిటీస్ డబ్బులకు కక్కుర్తి పడి సూపర్, డూపర్ అనేస్తారేమో. ఏదేమైనా ఆ కార్పోరేట్ అంటేనే కంపుకు కేరాఫ్ అని మరోసారి ప్రూవ్ అయింది.

Related Posts