‘అరే.. స్టాక్స్ ఉదమ్ములేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిపోతుంది” అని అంటున్నారు టాలీవుడ్ కింగ్ ఆఫ్ కామెడీ ఫిల్మ్స్ అనిల్ రావిపూడి. ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అనిల్ రావిపూడి. హాస్య చతురత, సరదాగా నవ్వే గుణం, నలుగురి ముఖాల్లోనూ నవ్వులు పంచే గుణం కన్నా గొప్ప క్వాలిటీ ఇంకేం ఉంటుంది. ఎవరు ఎలాంటి మూడ్‌లో ఉన్నా సెట్ చేసేది కామెడీనే. ఈ నవంబర్ నుంచి అదే పనిలో ఉండబోతున్నారు అనిల్ రావిపూడి. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ నవంబర్ నుంచి మొదలు కానుంది. ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది.
‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’లో చాలా ప్రత్యేకమైంది. స్టేజీల మీద కామెడీ చేసి, ప్రేక్షకులకు తమవైన మాటలతో చక్కిలిగింతలు పెట్టి కడుపుబ్బ నవ్వించే వారికి పెద్ద పీట వేస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి విశేషమైన స్పందన వస్తోంది. వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ వంటివాళ్లు చేసిన కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయం. ఇప్పటిదాకా ప్రేక్షకులకు చూపించని కోణాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ సెలబ్రిటీలు. సుడిగాలి సుధీర్ ఈ షోతోనే ఓటీటీలో అడుగుపెడుతున్నారు.
ఈ షో గురించి, ఆహా ద్వారా ఓటిటి లో అడుగుపెడుతునందుకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన నటులతో కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో నేను కూడా భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను.”
సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ…
నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుసినిమాటోగ్రఫి: ఎస్.చంద్రశేఖరన్‌సంగీతం:…
The combination Mahesh Babu - Rajamouli is eagerly awaited by movie lovers all over the…