Latest

స్టార్‌ స్టార్.. మెగాస్టార్‌.. అంటూ మారుమోగిన అగ్రరాజ్యం అమెరికా

స్టార్‌ స్టార్.. మెగాస్టార్‌.. అంటూ తెలుగునాట మార్మోగిపోతుంటుంది. కానీ ఈసారి మోగింది ఆంధ్ర తెలంగాణాలో కాదు.. అగ్రరాజ్యం అమెరికాలో ప్రఖ్యాత టైమ్‌ స్క్వేర్ ప్రాంతమంతా స్టార్‌ స్టార్ మెగాస్టార్‌ నినాదాలతో మార్మోగింది. భారతదేశంలో అత్యున్నత రెండో పురస్కారం పద్మవిభూషణ్‌ అవార్డ్‌కు ఎంపికైనందున మెగాస్టార్‌కు అభినందనలు తెలియజేస్తూ టైమ్‌స్క్వేర్‌ వద్ద మెగాస్టార్ సినీ జర్నీ వీడియోలను ప్రదర్శించారు.

కేక్ కట్ చేసిన ఆనందోత్సాహాలతో మెగాస్టార్‌ పద్మవిభూషన్‌ అవార్డ్‌ రావడాన్ని ఉత్సవంలా జరుపుకున్నారు. ఈ ఉత్సవాన్ని మెగాభిమాని రాజ్ అల్లాడ ఆధ్వర్యంలో అత్యంగా గ్రాండ్‌గా ఈ ఆత్మీయ అభినందన సమావేశం జరిగింది. అమెరికా వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు పాల్గొని కేక్‌ కట్‌ చేసి మెగాస్టార్‌కు అభినందనలు తెలియజేసారు. భవిష్యత్తులు చిరంజీవి భారతరత్న అందుకోవాలని ఆశించారు.


స్టార్ స్టార్ మెగాస్టార్, జై చిరంజీవా నినాదాలతో మార్మోగిన టైమ్‌ స్క్వేర్ ప్రాంతంలోనే, ప్రజాసేవ కేటగిరీలో పద్మవిభూషణ్‌ అందుకున్న మాన్యశ్రీ వెంకయ్యనాయుడు గారికి శుభాకాంక్షలు అందజేసారు ఎన్నారైలు.
ఈ కార్యక్రమంలో ప‌లు ఎన్నారైల తెలుగు సంఘాలు NATS, MATA, ATMIYA, APTA, TANA, NATA, AAA, NRIVA, TTA, NASAA, TFAS, ISANA సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా గ్రూప్ లీడ‌ర్స్.. ఓం ప్రకాశ్ నక్కా, విజయ్ రామిశెట్టి, బుల్లి కనకాల, గోపికృష్ణ గుర్రం, ఆనంద్ చిక్కాల, వెంకట్ నాగిరెడ్డి, లక్ష్మణ్ నాయుడు, అనిల్ కుమార్ వీరిశెట్టి, వంశీ కొప్పురావూరి తమ సహాయ సహకారాలు అందించారంటూ వారికి రాజ్ అల్లాడ కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Telugu 70mm

Recent Posts

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

17 mins ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

37 mins ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

3 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

4 hours ago

బుల్లితెర నటుడు చందు జీవితంలో మరో కోణం

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్య సంచలనం సృష్టించింది. సీరియల్ నటి పవిత్ర కార్ యాక్సిడెంట్ లో మరణించడం వలనే చందు…

4 hours ago

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం

టాలీవుడ్ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నార్సింగ్‌లోని అల్కాపూరి…

12 hours ago