ఎన్టీఆర్ రూట్ లో అల్లు అర్జున్ ..

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో యాక్షన్ సీన్స్ లో హీరోలు ఎక్కువగా స్టంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ఫైటర్స్ చేస్తున్నారు పాపం.. హీరో చేయి విదిలిస్తేనో.. లేక క్లోజప్ షాట్ లో క్రౌర్యంతో చూస్తూ వస్తోంటే విలన్స్ ఎక్కడి వారు అక్కడ పడిపోతున్నారు. అయితే కొందరు దర్శకులు మాత్రం హీరోల ఒళ్లు హూనం చేస్తుంటారు. అలాంటి వారిలో రాజమౌళి, బోయపాటి శ్రీను, సుకుమార్ వంటి దర్శకులుంటారు. వీళ్లు తమ హీరోల చేత వీలైనంత రియలిస్టిక్ గా ఫైట్స్ చేయిస్తుంటారు. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి ఇద్దరు హీరోల బెండు తీసినంత పనిచేశాడు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ తో చేయించిన టైగర్ ఫైట్ కు వాల్డ్ ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. అఫ్ కోర్స్ అక్కడ టైగర్ లేదు.. కేవలం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లోనే ఉంటుందనుకోండి. ఇప్పుడు ఇలాంటి ఫైట్ నే అల్లు అర్జున్ తో చేయించబోతున్నాడట సుకుమార్. ఐకన్ స్టార్ ను యంగ్ టైగర్ లా చూపించబోతున్నా.. సుకుమార్ మాత్రం రాజమౌళిని ఫాలో కావడం లేదు.

దీంతో ఈ సారి పుష్ప ది రూల్ కు ఇది బిగ్గెస్ట్ హైలెట్ కాబోతోందనే వార్తలు వస్తున్నాయి.పుష్ప సినిమా అంతా ఎలాగూ అడవిలోనే జరుగుతుంది కదా.. ? సో క్రూర మృగాలుంటాయి. వాటితో హీరోకు ఫైట్ పెడితే ఏ రేంజ్ లో ఉంటోందో ఊహించుకోండి. యస్.. ఈ సారి పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ కు టైగర్ తో ఫైట్ పెట్టబోతున్నాడు సుకుమార్. బట్ ఫర్ ఏ ఛేంజ్ అన్నట్టు రాజమౌళిలా విజువల్ ఎఫెక్ట్స్ లో కాకుండా నిజం పులితోనే ఫైట్ చేయించే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్. ఇలా 80, 90 మన హీరోలు చాలామంది నిజం పులులు, చిరుతలతో ఫైట్స్ చేసిన వారే. తర్వాత యానిమల్ యాక్ట్ వల్ల చేయడం మానేశారు. ప్రస్తుతం గ్రాఫిక్స్ అందుబాటులో ఉన్నా.. సుకుమార్ ఆ తరహా ఫైట్ చేయించాలనుకోవడం సాహసమే. ఇలాంటి సాహసాలకు మన స్టైలిష్ స్టార్ రెడీగా ఉంటాడు కాబట్టి పుష్ప2కు ఈ టైగర్ ఫైట్ మెయిన్ హైలెట్ అవుతుందనుకోవచ్చు.

Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

11 hours ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

14 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

15 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

15 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

15 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

20 hours ago