ఆహా వారు బాలయ్యను వాడుకుంటున్నారా..? వాయిస్తున్నారా..?

ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను.. ఈ సినిమా డైలాగ్ లైఫ్ లో అచ్చంగా సరిపోయే ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. ఒకసారి కథ విని డైరెక్టర్ కు ఎస్ చెబితే.. ఆ తర్వాత ఆ దర్శకుడు ఏం చెప్పినా ఎదురు చెప్పడు. అందుకే తొడకొడితే రైలు వెనక్కి వెళ్లిపోతుంది అని డైరెక్టర్ చెబితే సైలెంట్ తొడకొట్టుకున్నాడే కానీ.. అందులో లాజిక్ అడగలేదు బాలయ్య. ఈ కారణంగానే ఇలాంటి సిల్లీ సీన్స్ ను ఆయన సినిమాల్లో పెట్టేసి కొంతమంది దర్శకులు ఏకంగా ఇమేజ్ ను కూడా డామేజ్ చేశారు అనేది నిజం. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన తర్వాత ఇలాంటి సీన్స్ కు కాలం చెల్లింది అంటున్నారు. బట్ బాలయ్య విషయంలో కాలం చెల్లలేదు. అందుకు మరో నిదర్శనం రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా. ఈ సినిమాలోనూ చాలా సీన్స్ ఇల్లాజికల్ గానే ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్.


ఇక సినిమాలు అలా ఉంటే.. లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఓ టాక్ షోకు హోస్టింగ్ చేశాడు బాలయ్య. అంతకు ముందు ఆయన ఇమేజ్ దబిడి దిబిడే. బట్ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టిన తర్వాత బాలయ్య ఇమేజ్ మారిపోయింది. అప్పటి వరకూ బాలయ్యను అగ్రెసివ్ గా చూసినవాళ్లంతా అతన్లోని చిన్నపిల్లాడిని చూసి ఆశ్చర్యపోయారు. దగ్గరకు వస్తే కొట్టడం మాత్రమే తెలుసు అనుకున్న వారి థింకింగ్ ను దెబ్బకు మార్చేశాడు ఈ షోతో. ఓ రకంగా ఆహా అనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో బ్లాక్ బస్టర్ అయిన మొదటి షో ఇదే అంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో రక్తి కట్టించాడు. గెస్ట్ ఎవరైనా.. హోస్ట్ గా అన్ స్టాపబుల్ గా అన్ని ప్రశ్నలూ అందరినీ ఓపెన్ గా అడిగేసి ఔరా అనిపించాడు. ఇక ఇప్పటికే రెండు సీజన్స్ ముగిసిపోయాయి. థర్డ్ సీజన్ కూడా ఉంటుంది అన్నారు కానీ.. ఇప్పటి వరకూ దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు అన్ స్టాపబుల్ థర్డ్ సీజన్ ఊసు లేకపోయినా.. ఆహా లో వచ్చే అన్ని సీజనల్ ఎపిసోడ్స్ లోనూ బాలయ్యను తెగ వాడేస్తున్నాడు ఆహా ఓనర్ అల్లు అరవింద్. ఈ ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న షోస్ లో కంటెంట్ కాస్త వీక్ అయిందీ అనుకున్న ప్రతిసారీ బాలయ్యను రప్పించి జోష్ తెప్పించారు. ఆ షోస్ లో ఆయనతో మళ్లీ మళ్లీ స్టెప్పులు వేయిస్తున్నారు. ఆయన కూడా ఏ మాత్రం తగ్గకుండా తనదైన శైలిలో రెచ్చిపోతూ రచ్చ చేస్తున్నాడు. ఆ మధ్య ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఇండియన్ ఆర్మీలో పనిచేసే వ్యక్తిని గౌరవిస్తూ బాలయ్య చెప్పిన మాటలు ఆయనపై గౌరవాన్ని పెంచాయి కూడా.

ఆ తర్వాతా.. ఇప్పుడూ కూడా ఆహాలో ఇండియన్ ఐడల్ తెలుగు పోటీల్లో బాలయ్యను ప్రతిసారీ పిలుస్తున్నారనిపిస్తోంది. లేటెస్ట్ గా ఆహాలో వచ్చే వెబ్ సిరీస్ లను కూడా బాలయ్య చేత ప్రమోషన్స్ చేయిస్తున్నారు. మొత్తంగా ఈ ఆహా వాళ్లు మాత్రం ఎక్కడ వీక్ అయితే అక్కడ అన్నట్టుగా బాలయ్యను ప్రతిసారీ తెగ వాడేస్తున్నారు. మరి ఇవన్నీ అగ్రిమెంట్ లో భాగంగానే ఉన్నాయా లేక.. బాలయ్య మొహమాటానికి చేస్తున్నాడా అనేది చెప్పలేం కానీ.. ప్రస్తుతం బాలయ్యకు ఉన్న సినిమాల షెడ్యూల్స్ తో పాటు రాబోయే ఎలక్షన్స్ ను బట్టి చూస్తే.. ఆహాలో మరో సీజన్ కు ఆస్కారం లేదనిపిస్తోంది. అన్ స్టాపబుల్ ఆగినా.. ఆహా వారి బాలయ్య వాడకం మాత్రం ఆగేలా కనిపించడం లేదు. మరి ఈ వాడకానికి ఎక్స్ పైరీ డేట్ ఎప్పుడో కానీ.. ఏదైనా అతిగా వాడితే అసలుకే ప్రమాదం వస్తుందని అల్లు వారూ తెలుసుకుంటే మంచిదేమో.

Related Posts