రామ్ చరణ్ టైటిల్ మాస్ కు కనెక్ట్ అవుతుందా..?

ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుగా ఉంది రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్. శంకర్ డైరెక్షన్లో నటిస్తోన్న సినిమా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు కాబట్టి.. ఓ మాసివ్ టైటిల్ తో వస్తారు అనుకుంటే అదేదో టివి షోస్ లో కనిపించే టైటిల్ లా గేమ్ ఛేంజర్ అని పెట్టారు. బట్ ఈ టైటిల్ మాస్ కు పెద్దగా కనెక్ట్ కాదు అని మెగా ఫ్యాన్స్ నుంచి కూడా టాక్ వినిపిస్తోంది. టైటిల్ ను బట్టి చూస్తే ఇది చట్ట సభలతో పాటు, బ్యూరోక్రాట్స్ కు సంబంధించిన కథ అని అర్థం అవుతూనే ఉంది.

పైగా ఈ విషయాన్ని మూవీ టీమ్ కూడా ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా చాలాసార్లు చెప్పారు కూడా. దీంతో పొలిటికల్ గా కనెక్ట్ అయ్యేలా.. అదిరిపోయే టైటిల్ వస్తుందని ఆశిస్తే.. వారి ఆశలన్నీ ఆవిరయ్యేలా ఈ ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చాడు శంకర్.


నిజానికి గేమ్ ఛేంజర్ అనేది రామ్ చరణ్ లాంటి గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్ కు సూట్ అయ్యే టైటిల్ కాదు. ఒకవేళ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేస్తున్నారు కాబట్టి.. ఇలా ఇంగ్లీష్ టైటిల్ అయితే బావుంటుంది అనుకున్నారు.. అనిపించినా.. అదే ఇంగ్లీష్ లో ఇంతకంటే పవర్ ఫుల్ టైటిల్సే దొరకలేదా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. పైగా ఇలాంటి టైటిల్ తో ఆ మధ్య కొన్ని మినీ రేంజ్ మూవీ కూడా ఒకటి వచ్చింది. మరి ఆ పేరును రామ్ చరణ్ కు వాడటం ఎంత వరకూ సబబు అనేది వారే ఆలోచించుకోవాలి.

పైగా ఆర్ఆర్ఆర్ తో అతను అన్ని వయసుల వారికీ బాగా దగ్గరయ్యాడు. ఈ టైటిల్స్ తో వస్తే ఆ అన్ని వయసుల వారిలో కొందరైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేకపోలేతు. ఇంకా చెబితే ఇప్పటికే గ్లోబర్ స్టార్ అని పిలుచుకుంటోన్న తమ హీరో కోసం ఓ బ్లాస్టింగ్ టైటిల్ ఎక్స్ పెక్ట్ చేసిన ఫ్యాన్స్ ను నిరాశపరిచారు అనే చెప్పాలి. మరో విషయం ఏంటంటే.. ఈ టైటిల్ డిజైనింగ్ కూడా గొప్పగా ఏం లేదు. చాలా సాధారణంగా ఉంది. ఏదేమైనా తమ అభిమాన హీరో బర్త్ డే రోజు వచ్చిన టైటిల్ కాబట్టి ఫ్యాన్స్ తమ అసంతృప్తిని ఓపెన్ చేయలేదు. కానీ మాస్ కు మాత్రం ఈ టైటిల్ కనెక్ట్ కావడం కష్టమే అని ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది.

Related Posts