కోలీవుడ్ హీరోతో పీకల్లోతు ప్రేమలో నిధి

అందాల భామ నిధి అగర్వాల్ ప్రేమలో పడింది. ప్రొఫెషనల్ కెరీర్ తో పాటు పర్సనల్ లైఫ్ నూ ఎంజాయ్ చేస్తోంది. తమిళ హీరో శింబుతో నిధి ప్రేమాయణం ఇప్పుడు టాక్ ఆఫ్ కోలీవుడ్ అయ్యింది. నిధి శింబూతో ఈశ్వరన్ అనే చిత్రంలో నటించింది. గతేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా తమిళనాట మంచి విజయాన్ని సాధించింది. ఈ విజయంతో పాటు పర్సనల్ గా దగ్గరయ్యారు నిధి, శింబూ. గతంలో నయనతార, త్రిషతో శింబు నడిపిన లవ్ ఎఫైర్స్ ఇండస్ట్రీ అంతా తెలిసినవే. ఇక ఈ లవ్ స్టోరి హీరోకు కొత్త కాకపోయినా…నిధికి మాత్రం ఇది ఫస్ట్ లవ్ నే. గతంలో ఏ హీరోతోనూ నిధి సన్నిహితంగా ఉన్న సందర్భాలు లేవు. సినిమాల వరకు ప్రొఫెషనల్ గా మూవ్ అయ్యింది నిధి. అంతకుమించిన ఫ్రెండ్ షిప్ చేయలేదు. ఫస్ట్ టైమ్ నిధి లవ్ ఎఫైర్ గురించి బయటకొచ్చింది.

తెలుగులో సవ్యసాచి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆమె ఫ్యామిలీకి హైదరాబాద్ తో అనుబంధం ఉంది. నాగచైతన్యతో తొలి చిత్రంలో నటించాక..రెండో సినిమా అతని సోదరుడు అఖిల్ సరసన నటించింది. అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్నూ కూడా అంతగా విజయం సాధించలేదు. దీంతో నిధి కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఈ టైమ్ లో పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఆమెకు ఫస్ట్ హిట్ ను ఇచ్చింది. ఇస్మార్ట్ విజయంతో మరో నాలుగైదు ప్రాజెక్టులు దక్కించుకుంది నిధి. తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాల ఆఫర్స్ వచ్చాయి. ఆ క్రమంలోనే ఈశ్వరన్ సినిమా చేసింది. తమిళంలో డెబ్యూ ఫిల్మ్ తో పాటు లవ్ లోనూ డెబ్యూ ఇచ్చింది నిధి.

తనతో నటించిన హీరోయిన్లతో లవ్ లో పడుతుంటాడు శింబు. వల్లవన్ సినిమా టైమ్ లో నయనతారతో, గౌతమ్ మీనన్ సినిమా చేస్తున్నప్పుడు త్రిషతో ప్రేమ కబుర్లు చెప్పాడు. ఈశ్వరన్ సినిమా షూటింగ్ లో నిధికి దగ్గరయ్యాడు. తరుచూ పడే ప్రేమల్లో ఎంత నిజాయితీ ఉందో నిధి గ్రహిస్తే మంచిది. గత ప్రేమలన్నీ ఊరికే అని..నిన్నే గాఢంగా ప్రేమిస్తున్నా ఒట్టు అని శింబు చెప్పాడో ఏమో గానీ నిధి అతన్ని బాగా నమ్మేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం గల్లా అశోక్ తో నిధి నటించిన హీరో సినిమా సంక్రాంతి పండక్కి విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది నిధి.

Telugu 70mm

Recent Posts

ఢిల్లీ బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…

2 hours ago

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

6 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

6 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

9 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

10 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

12 hours ago