రవిరెడ్డి కెరీర్ ను ఓ గాడిన పడేసిన “గాలోడు”

“గాలోడు” సాధిస్తున్న ఘన విజయంతో గాలిలో విహరిస్తున్న “రవిరెడ్డి”

  ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్లుగా... ఒకే ఒక్క సినిమా "కెరీర్"ను మార్చేస్తుంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. అలాంటి సినిమా కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తనకు "గాలోడు" రూపంలో ఓ ఘన విజయం లభించిందని అంటున్నారు అమెరికా రిటర్నడ్ బిజినెస్ మేన్ రవిరెడ్డి. "గాలోడు" సాధిస్తున్న అసాధారణ విజయం తనను గాల్లో విహరించేలా చేస్తున్నదని చెబుతున్నారు!!

ఇంటిలిజెంట్, దర్పణం, దొరసాని, డిగ్రీ కాలేజ్, వి, విరాటపర్వం, సాప్ట్వేర్ సుధీర్” తదితర చిత్రాలతో నటుడిగా ఇప్పటికే తన సత్తాను ఘనంగా చాటుకున్న రవిరెడ్డి… “గాలోడు” చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో సముచిత పాత్ర పోషిస్తూ… అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేయడంతోపాటు… ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుని, అక్కడ మోడలింగ్ సైతం చేసిన రవిరెడ్డి ఇప్పుడు టాలీవుడ్ లో పూర్తి స్థాయిలో నటనపై దృష్టి సారిస్తున్నారు.

“గాలోడు” చిత్రంలో హీరోయిన్ ఫాదర్ గా నటనకు ఆస్కారమున్న ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చి… “స్టైలిష్ అండ్ హ్యండ్సం ఫాదర్ రోల్”తో తన నట జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకనిర్మాత “రాజ శేఖర్ రెడ్డి పులిచర్ల”కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నారు రవి రెడ్డి!!

Telugu 70mm

Recent Posts

ఆ విషయంలో వెనుకబడ్డ రామ్ చరణ్

ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…

3 hours ago

పవన్, ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ కోసం మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…

3 hours ago

సైలెంట్ గా మొదలెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…

5 hours ago

టాలీవుడ్ పైనే ఆశలు పెట్టుకున్న బాలీవుడ్

బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…

7 hours ago

కమల్ ‘థగ్ లైఫ్‘లోకి మరో థగ్ వచ్చాడు..!

దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…

9 hours ago

‘బ్రహ్మ ఆనందం‘.. తాత మనవళ్లుగా మారిన తండ్రీకొడుకులు

పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు.…

9 hours ago