ఏప్రిల్ 1న ఉగాది పండక్కి “ఆచార్య”

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్య రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. ఏప్రిల్ 1న ఉగాది పండగ సందర్భంగా ఆచార్యను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఫిబ్రవరిలో ఆచార్య విడుదల ఉండగా..కరోనా కేసులు పెరగడం వల్ల వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరమ్, కాజల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో ఆచార్య చిత్రం తెరకెక్కింది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

కరోనా మహమ్మారి వల్ల ఎక్కువగా నష్టపోయిన సినిమా ఆచార్య అని చెప్పొచ్చు. ఫస్ట్ వేవ్ లో మొట్టమొదట షూటింగ్ ఆపేసిన సినిమా ఆచార్య. ఆ తర్వాత చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ఇతర కార్యక్రమాలకు కూడా లాక్ డౌన్, కోవిడ్ చాలా ఇబ్బందులు పెట్టింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక కూడా ఎన్నోసార్లు మార్చుకోవాల్సి వచ్చింది. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వాయిదా పడిన తర్వాత అందరి దృష్టి ఆచార్య మీదకు వెళ్లింది. అయితే ఫిబ్రవరిలో ఆచార్య విడుదల ఉండదని ప్రకటించిన చిత్ర బృందం..తాజాగా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు.

నిపుణుల అంచనా ప్రకారం పిబ్రవరి 15కు కరోనా కేసులు దేశంలో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని తెలుస్తోంది. మార్చి వదిలేసినా ఏప్రిల్ లో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి థియేటర్ లకు ప్రేక్షకులు భయం లేకుండా వస్తారని ఆచార్య టీమ్ ఆశిస్తోంది. అందుకే ఈ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు అర్థమవుతోంది. ఎలాగూ ఆలస్యమయింది కాబట్టి ఓ మంచి డేట్ చూసి సినిమాను విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది మెగాస్టార్ టీమ్.

Related Posts