2023లో ప్రపంచం అంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకున్న ఆదిపురుష్ మూవీ ట్రైలర్ లాంచ్ కు వేళయింది. మే 9న గ్లోబల్ ట్రైలర్ లాంచ్‌తో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ మెగా ట్రైలర్ లాంచ్‌ను ప్రకటిస్తూ.. ఆదిపురుష్ నుంచి పాన్-ఇండియా స్టార్, ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆల్రెడీ న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్లో అంతర్జాతీయ ప్రీమియర్‌కు సెలెక్ట్ కావడం ద్వారా ఓ గొప్ప మైల్ స్టోన్ ను సాధించింది ఆదిపురుష్. ఇప్పటికే విడుదలైన ప్రతి గ్లింప్స్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం అద్భుతమైన ట్రైలర్ తో రెడీ అయ్యింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ఈ ట్రైలర్ ను రికార్డ్ స్థాయిలో లాంచ్ చేయబోతున్నారు. అందుకే ఇది వరల్డ్ ఈవెంట్ గా మారింది.
భారతదేశంతో పాటు సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా యూఎస్ఏ, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా & దక్షిణాసియాలోని భూభాగాల్లో; ఆఫ్రికా, యూకే అండ్ యూరప్, రష్యా, ఈజిప్ట్ దేశాల్లో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ గొప్ప భారత ఇతిహాస కథ ప్రపంచ ప్రేక్షకులను ఓ సాహసోసేతమైన యాక్షన్ ప్రపంచంలోకి తీసుకువెళుతుందని చెబుతున్నారు మేకర్స్.
ఏదేమైనా రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో ప్రమోషన్స్ పరంగా దూకుడు పెంచాలంటే ముందుగా ట్రైలర్ విడుదల చేస్తే.. దాన్నుంచి ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానాలుచెప్పడం ద్వారా మూవీ ప్రమోషన్స్ తో హైప్ పెంచొచ్చుఅనేది మేకర్స్ ఆలోచన.
ఇక ప్రభాస్ రాముడుగా, సీత పాత్రలో కృతి సనన్ నటించిన ఈచిత్రంలో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహాన్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకైతే ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. మరి ట్రైలర్ తర్వాతైనా ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయో లేదో చూడాలి.
సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు ఈ…
నటీనటులు: సుందర్.సి, తమన్నా, రాశీ ఖన్నా, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, కోవై సరళ తదితరులుసినిమాటోగ్రఫి: ఈ కృష్ణసామిసంగీతం: హిప్ హాప్…
నటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ,…
నటీనటులు: సుహాస్, పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్, నందు, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులుసినిమాటోగ్రఫి: ఎస్.చంద్రశేఖరన్‌సంగీతం:…
The combination Mahesh Babu - Rajamouli is eagerly awaited by movie lovers all over the…