ఆ అమ్మాయి గురించి చాలానే చెప్పారు..

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ఇదో వాక్యం.. ఈ వాక్యాన్ని సినిమా టైటిల్ గా పెట్టడం అంటే కథ కూడా కాస్త వైవిధ్యమైనదే అనుకోవాలి. పైగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా అంటే పొయొటిక్ సెన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అది టైటిల్స్ నుంచే కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా విషయంలో ముందు నుంచీ మ్యాగ్జిమం పాజిటివ్ వైబ్సే కనిపించాయి. ఇంద్రగంటి రీసెంట్ మూవీ “వి” పోయినా.. ఈ మూవీ టైటిల్ నుంచి అందరి అటెన్షన్ ను డ్రా చేసింది. సుధీర్ బాబుతో అంతకు ముందు సమ్మోహనం అనే అందమైన సినిమా చేసి ఉండటంతో పాటు లేటెస్ట్ యూత్ ఫుల్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా ఉండటం ఈ మూవీకి అన్ని రకాలుగా ప్లస్ అయింది. ఆ ప్లస్ లకు హెడ్ మైత్రీ మూవీస్ అనే బ్యానర్.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను మహేష్‌ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో ఈ అమ్మాయి గురించి ఏం చెప్పబోతున్నారనేది తేల్చారు.ఓ అస్పైరింగ్ సినిమా డైరెక్టర్. డాక్టర్ అయిన అమ్మాయిని చూసి తన సినిమాలో హీరోయిన్ గా చేయించాలనుకుంటాడు. కానీ ఆమె కుటుంబానికి సినిమాలంటే అసహ్యం. ఎంత అసహ్యం అంటే సినిమాలకు సంబంధించి ఏ పని చేస్తున్నవారైనా సరే అసలు మనిషే కాదు అనుకునేంతగా. మరి అలాంటి ఫ్యామిలీ అమ్మాయిని ఏకంగా హీరోయిన్ గా తీసుకోవాలంటే అవుతుందా.. ? కానీ “ప్రేమ” ఉంటే అవుతుంది. మరి ఈ ప్రేమ ఆమె కుటుంబ జీవితంలో ఎన్ని సమస్యలు తెచ్చింది. ట్రైలర్ లో చూపినట్టుగా తను అందంగా ఉన్నా..

ఎందుకు “మూడీ”గా ఉంటుంది అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ నెల 16న ఈ సినిమా విడుదల కాబోతోంది.
మొత్తంగా ట్రైలర్ పూర్తిగా ఇంద్రగంటి శైలిలో కనిపిస్తోంది. సినిమా కూడా అదే విధంగా ఉంటుందని అర్థమైపోతుంది. సుధీర్ బాబు, కృతిల మధ్య కెమిస్ట్రీ ఈ మూవీకి హైలెట్ అవుతుందనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. దర్శకుడితో పాటు హీరోహీరోయిన్ కూ ఈ మూవీ విజయం ఇప్పుడు చాలా అవసరం. ఆ అవసరాన్ని తీర్చేలానే కనిపిస్తోందీ ట్రైలర్ చూస్తోంటే. బట్ ట్రైలర్ తోనే సినిమా రిజల్ట్ ను చెప్పేయలేం కాబట్టి.. ముందుగా ఆ అమ్మాయి గురించి చెప్పబోతోన్న ఈ ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్ అనేద్దాం..

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

1 hour ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

2 hours ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

2 hours ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago