Ashish vidyarthi: 60యేళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న విలన్

ఆశిష్‌ విద్యార్థి.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించాడు. ఆశిష్ విద్యార్థి విలనీ ప్రత్యేకంగా ఉంటుంది. క్రూరత్వాన్ని కళ్లతోనే పలికించగలడు ఆశిష్. మళయాలీ ఫాదర్, రాజస్థానీ మదర్ కు ఢిల్లీలో పుట్టాడు ఆశిష్‌ విద్యార్థి. తర్వాత అతని కుటుంబం కోల్ కతాలో సెటిల్ అయింది. 1990లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి తనే సొంతంగా ఓ నాటక కంపెనీ పెట్టుకున్నాడు. కొన్నాళ్లకు ముంబై చేరుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి త్వరగానే పాపులర్ అయ్యాడు.

నటుడుగా కెరీర్ మొదలుపెట్టిన కొన్నాళ్లకే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్‌డ్ కూడా రావడం విశేషం. హిందీ నుంచి తర్వాత సౌత్ లోని అన్ని భాషల్లో విలన్ గా, ప్రధాన విలన గా ఎన్నో సినిమాల్లో నటించాడు. మిణుగురులు చిత్రంలో నటనకు నంది అవార్డ్ కూడా వచ్చింది ఆశిష్ కి. అలాంటి ఆశిష్ విద్యార్థి ఈ గురువారం( మే 25న) పెళ్లి చేసుకున్నాడు.


ఆశిష్‌ విద్యార్థికి గతంలోనే సినిమా పరిశ్రమతోనే సంబంధాలున్నా రాజౌషీ బారువాతో పెళ్లైంది. వీళ్లు ఎందుకు విడిపోయారు అనే క్లారిటీ లేదు కానీ.. కొన్నాళ్లుగా అతను సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ పెట్టుకుని దేశవ్యాప్తంగా తిరుగుతూ రకరకాల వ్లాగ్స్ చేస్తున్నాడు. మరోవైపు మోటివేషనల్ స్పీకర్ గానూ మెప్పిస్తున్నాడు.

ఈ క్రమంలో సడెన్ గా అరవైయేళ్ల వయసులో అతను గువాహటీకి చెందిన రూపాలి బారువాను పెళ్లి చేసుకోవడం ఆశ్చర్చం. తెలుగులో విలన్ గానే తెలిసినా బాలీవుడ్ అతన్ని ఓ గ్రేట్ యాక్టర్ గా చూస్తుంది. దీంతో ఆశిష్ విద్యార్థి పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయసు కాదు కానీ ఇప్పుడు అతని మనసు ఓ తోడును కోరుకుందని మాత్రం అర్థం చేసుకోవచ్చు.

Telugu 70mm

Recent Posts

మూడు సినిమాలతో బిజీగా విజయ్ దేవరకొండ

హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం లేకుండా టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. గత చిత్రం…

1 hour ago

చిరంజీవి.. జూనియర్ ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన సందర్భం

ఈతరం నటుల్లో అన్ని తరహా పాత్రలు పోషించగల సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్. ఒక డైలాగ్ చెప్పాలన్నా.. డ్యాన్సులు…

2 hours ago

‘కుబేర’ కోసం సరికొత్తగా కింగ్ నాగార్జున

కథ నచ్చితే చాలు కాంబినేషన్స్ గురించి అస్సలు పట్టించుకోడు కింగ్ నాగార్జున. ఈకోవలోనే.. పలు మల్టీస్టారర్స్ కి ఓ.కె. చెబుతుంటాడు.…

2 hours ago

‘Baahubali.. Crown of Blood’ trailer.. Mahishmati is going to be shown in a new series

Director Rajamouli is known for the sensational success of his magnum opus 'Baahubali'. A television…

16 hours ago

‘బాహుబలి.. క్రౌన్ ఆఫ్ బ్లడ్‘ ట్రైలర్.. మహిష్మతిని కొత్తగా చూపించబోతున్న సిరీస్

దర్శకధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘బాహుబలి‘ సృష్టించిన సంచలన విజయం గురించి తెలిసిందే. ‘బాహుబలి‘ మూవీ సిరీస్ లోని పాత్రలు,…

17 hours ago

‘Jithender Reddy’ trailer.. Intense political thriller

The movie 'Jithender Reddy' starring Rakesh Varre of 'Baahubali' fame in the lead role. 'History…

17 hours ago