బాలయ్య కోసం భారీ సెట్..

ఈ మధ్య అన్ని భాషల సినిమాల్లోనూ విజువల్ గ్రాండీయర్ బాగా పెరుగుతోంది. ఇందుకోసం ఎంత ఖర్చైనా వెనకాడటంలేదు. ఒకప్పుడు ఇందుకోసం కొంతమంది దర్శకులు మాత్రమే ఉండేవారు. బట్ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందరు దర్శకులు విజువల్ గ్రాండీయర్ కోసం తాపత్రయపడుతున్నారు.

అందుకే ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా నందమూరి బాలకృష్ణకు ఓ పాట కోసం భారీగా ఖర్చుపెడుతున్నారు. మామూలుగా ఇలాంటివి బాలయ్య ఇష్టపడడు. బట్ ట్రెండ్ నడుస్తోంది కదా.. తనూ కామ్ అయిపోయాడు. పైగా అఖండ, వీర సింహారెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చి ఉన్నాడు కదా.. ఆ ఊపును కంటిన్యూ చేయడానికి ఈ మాత్రం రిచ్ నెస్ ఉండాలనుకున్నాడేమో.. తను కూడా ఓకే అన్నాడు. ఇంతకీ ఇదంతా ఏ సినిమా గురించో ఊహించారు కదా..?


ప్రస్తుతం బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోంది కదా..? రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు తమ చిత్రాన్ని దసరా బరిలో అక్టోబర్ 21న విడుదల చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. బాలయ్య సరసన ఫస్ట్ టైమ్ కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేయబోతోన్న ఈ చిత్రంలో కుర్ర బ్యూటీ శ్రీ లీల ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇందులో శ్రీ లీల బాలయ్య అన్న కూతురుగా నటిస్తోంది అనేటాక్ ఉంది.


ఈ సినిమాలో ఓ సీన్ ప్రకారం వినాయకచవితి సందర్భంగా ఓ పాట వస్తుందట. కేవలం ఫెస్టివ్ మోడ్ లోనే కాక.. ఈ పాట కథలోనూ భాగంగానే ఉంటుందని చెబుతున్నారు. అందుకే కేవలం ఈ ఒక్క పాట కోసమే ఏకంగా 5 కోట్లు ఖర్చుపెడుతున్నారట. అంటే బలగంలాంటి సినిమాలు రెండు చేయొచ్చన్నమాట. బట్.. ముందే చెప్పాం కదా.. విజువల్ గ్రాండీయర్ కోసం ఎంత దూరమైనా వెళుతున్నారీ మధ్య. అదీ కాక పాట కథలో భాగంగా రన్ అవుతుందంటున్నారు కాబట్టి.. ఆ మాత్రం ఖర్చుపెట్టొచ్చు.

పైగా ఈ మధ్య బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్దే కాదు.. ఓటిటిలో కూడా అదరగొడుతున్నాయి. దీంతో నిర్మాతలు కూడా ఈ ఖర్చుకు వెనకాడ్డం లేదు.మరోవైపు అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు కాబట్టి ఢోకా లేదు అనుకున్నారేమో కానీ ప్రస్తుతం ఈ పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేస్తున్నారు. ఏదేమైనా బాలకృష్ణ కెరీర్ లోనే ఇదే కాస్ట్ లీయొస్త్ సాంగ్ గా చెప్పొచ్చు.

Related Posts