రావణాసురను ఢీ కొట్టాలంటే మీటర్ లో ఈ స్పీడ్ సరిపోదేమో..

ఏ హీరో అయినా ఓపెనింగ్స్ తెచ్చుకోవడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆ దమ్మున్న హీరోల రేంజ్ వేరే ఉంటుంది. ఆ రేంజ్ లోకి ఎప్పుడో వచ్చేశాడు సీనియర్ హీరో రవితేజ. పైగా మాస్ రాజా మూవీ అంటే టాక్ తో పనిలేకుండా టికెట్స్ కొనే ప్రేక్షకులు, ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అలాంటి హీరోను ఢీ కొట్టేందుకు సిద్ధమైనప్పుడు మరో హీరో ప్రమోషన్స్ లో కష్టపడాలి.

ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి కొత్త ఎత్తులు వేయాలి. బట్ ఇంకా ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్ రాకున్నా.. ఓపెనింగ్స్ తెచ్చే సత్తా లేకున్నా.. కుర్ర హీరో కిరణ్ అబ్బవరం మాస్ రాజాను ఢీ కొట్టేందుకు ఈ నెల 7న రావణాసురతో కలిసి వస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఇప్పటి వరకూ ప్రమోషన్స్ పరంగా చూసుకున్నా.. క్రేజ్ పరంగా చూసుకున్నా.. రావణాసుర ముందే ఉంటుంది. అయినా ఆ టీమ్ మొత్తం చాలా కష్టపడుతూ.. ప్రమోషన్స్ చేస్తోంది. అది మరింత ఓపెనింగ్స్ తెచ్చేందుకు యూజ్ అవుతుంది.


అయితే కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ విషయంలో అంత స్పీడ్ కనిపించడం లేదు. ఒక వేళ వాళ్లు స్పీడ్ గానే ఉన్నారు అనుకున్నా.. ఆ ప్రమోషన్స్ ఆడియన్స్ వరకూ చేరడం లేదు అంటే అది ఖచ్చితంగా పిఆర్ టీమ్ మిస్టేక్. అయితే కిరణ్ రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుని ఉన్నాడు. ఆ హిట్ ను కంటిన్యూ చేస్తూ మరో హిట్ కొట్టాలంటే ఖచ్చితంగా టైమ్ చూసుకుని రావాలి. ఈ విషయంలో రవితేజ లాంటి హీరో ఉన్నాడు అని తెలిసినా వస్తున్నారంటే కంటెంట్ పై నమ్మకం అనుకోవాలి. బట్ వారి నమ్మకాలతో ప్రేక్షకులను పనిలేదు. ప్రేక్షకుల్లో నమ్మకాలను పెంచేది ప్రమోషన్సే. అలాగని మరీ వీరలెవల్లో ప్రమోషన్స్ చేసిన ఆడియన్స్ కు ముందే డౌట్ వస్తోన్న రోజులు. కాకపోతే ఓ పెద్ద హీరోను ఢీ కొట్టలంటే చిన్న హీరోలు ప్రమోషన్స్ లో వైవిధ్యాన్ని చూపించాలి. చిన్న పనితోనే పెద్దగా అట్రాక్ట్ చేయగలగాలి. అలా చూస్తే కిరణ్ అబ్బవరం చేస్తోన్న ఈ ప్రమోషనల్ మీటర్ అంత వేగంగా లేదేమో అనిపిస్తోంది.

Related Posts