హిట్2 కు ఊపు తెచ్చిన 17 సినిమాలు

17 సినిమాలు.. ఒకే రోజు విడుదలైతే ఎలా ఉంటుంది. బాక్సాఫీస్ కు ఎలాంటి ఊతం వస్తుంది..? బట్ అవేం రాలేదు. చెప్పుకోవాడానికి ఇదేదో రికార్డ్ లా కనిపించినా.. ఇన్ని సినిమాల్లో ఒక్కటీ ఆడియన్స్ తో అద్భుతం అనిపించలేకపోయింది. అసలు వీటిలో రిలీజ్ కుముందు బజ్ ఉన్న చిత్రాలే మూడు నాలుగు. అవి కూడా జనాలను ఎంటర్టైన్ చేయడంలో ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయాయి.

నిజానికి కంటెంట్ లేని సినిమాలతో వస్తూ.. చిన్న సినిమాలను చంపేస్తున్నారు అని చెప్పడం ఎంత వరకూ సబబు..? ఇక ఈ సినిమాల్లో గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం, పంచతంత్ర వంటి సినిమాలపై అనూహ్యంగా అంచనాలు కూడా ఉన్నాయి. బట్ వాటిని అందుకోవడం కాదు కదా.. కనీసం బావున్నాయి అని కూడా అనిపించుకోలేకపోయాయీ చిత్రాలు. ఇక ఈ సినిమాలన్నీ పోవడం హిట్ 2 సినిమాకు బాగా కలిసొచ్చింది. ఎప్పుడో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిన ఈ మూవీకి ఇప్పుడు మరింత కలెక్షన్స్ పెరుగుతున్నాయి.


మామూలుగానే టాక్ తెలిసిన తర్వాతే థియేటర్స్ కు వెళుతున్నారు ప్రేక్షకులు. ఇన్ని సినిమాలు పోయిన తర్వాత ఇంకా వాటికి ఎందుకు వెళతారు. అవసరమైతే హిట్ అయిన సినిమాలనే మరోసారి చూస్తారు. అందుకే అడవి శేష్‌ హిట్2 కు ఈ చిత్రాలన్నీ ఇన్ డైరెక్ట్ గా హెల్ప్ చేశాయి. దీంతో ఈ వీకెండ్ కు మరింత కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు. దీంతో పాటు లవ్ టుడే ఉన్నా.. ఆ చిత్రానికీ కలిసొచ్చేదే. కానీ మాగ్జిమం థియేటర్స్ లో ఈ సినిమాల కోసం ఆ సినిమాను తీసేశారు. మొత్తంగా 17 సినిమాలు ఒకేరోజు విడుదల అంటూ గ్రాండ్ గా చెప్పుకున్నారు కానీ.. ఒక్కటి కూడా మరో రోజు వరకూ ఆసక్తిని నిలుపుకోలేదు.

Related Posts