రవితేజ హై ఇంటెన్స్ ఎమోషన్స్ తో ‘ఈగల్‘

ఈ ఏడాది దసరా బరిలో ‘టైగర్ నాగేశ్వరరావు‘గా మురిపించిన మాస్ మహారాజ రవితేజ.. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ‘ఈగల్‘ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ‘కార్తికేయ 2, ధమాకా’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, కావ్యథాపర్ ఇతర కీ రోల్స్ లో పోషిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి వస్తోన్న ‘ఈగల్‘ మూవీ టీజర్ రిలీజయ్యింది. ‘కొండలో లావాని కిందకి పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు‘ అంటూ రవితేజ హై ఇంటెన్స్ వాయిస్ తో టీజర్ మొదలైంది. ఈలోపులో అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ. అతను ‘ఎక్కడ ఉంటాడు‘ అంటే ‘అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు.. కానీ.. వ్యాపించి ఉంటాడు‘ అంటూ అవసరాల శ్రీనివాస్ బదులివ్వడం టీజర్ లో ఆకట్టుకుంటుంది.

‘ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపం..‘ అంటూ ఈ సినిమాలో రవితేజ పాత్రకు ఇస్తోన్న హైప్ మాత్రం మామూలుగా లేదు. ఈ సినిమాకోసం పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ మహారాజ సరికొత్త మేకోవర్ తో సందడి చేయబోతున్నాడు. టీజర్ తో సమ్ థింగ్ స్పెషల్ గా అనిపిస్తున్న ‘ఈగల్‘ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts