రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి విషయాన్ని టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి రెబల్ అనే సినిమా చేసిన రాఘవ లారెన్స్ తాజాగా కృష్ణంరాజు మృతి నేపథ్యంలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాను కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నానని ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగే చాలా కేర్ తీసుకుంటారని అన్నారు. ఒక తల్లి పిల్లలకు ఎలా అయితే ఆలనా పాలనా చూస్తుందో ఆయన కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారని, తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం తన దురదృష్టం అని అందుకే ఆయనను కడసారి చూసుకోలేకపోయాను అని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఆయన లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు.
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…
Man of masses NTR's birthday.. Only two more days left. He is acting as Young…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…