స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’. సెన్సేషనల్ ‘డీజే టిల్లు’కి సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 29న విడుదలకు ముస్తాబవుతోంది. లేటెస్ట్ గా సిద్ధు బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. రాత్రి సమయంలో కారు నడుపుతూ తన పక్కనే ఉన్న లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) నుండి టిల్లు ముద్దును పొందడం మనం గ్లింప్స్ లో చూడవచ్చు. అతని గత పుట్టినరోజు గురించి లిల్లీ అడుగగా.. రాధికతో జరిగినప్పటి సంఘటనలను టిల్లు గుర్తు చేసుకోవడం ఈ గ్లింప్స్ లో ఆకట్టుకుంది.
అయితే రాధికతో జరిగిన విషయాల గురించి టిల్లు పూర్తిగా చెప్పకుండా తనదైన హాస్య పద్ధతిలో సింపుల్ గా ముగించాడు. అలాగే ఆ విషయం అతనికి బాధ కలిగిస్తుంది కాబట్టి.. దాని గురించి ఇక ప్రశ్నలు అడగవద్దని లిల్లీని కోరతాడు. మొత్తానికి వీరి మధ్య సంభాషణ ఎంతో వినోదభరితంగా సాగింది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మరోసారి డైలాగులతో మ్యాజిక్ చేశాడు.
ఈ సినిమా ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా.. థమన్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నాడు.