ఇప్పటికీ ట్రెండింగ్ లో ‘ఖుషి’

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. నమ్మకాలు, సంప్రదాయాలు ప్రేమకు అడ్డురావనే సందేశంతో లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాని నిర్మించారు. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. థియేటర్లలో ‘ఖుషి’కి మంచి రెస్పాన్స్ దక్కింది. ‘లైగర్’ ఫ్లాప్ తో ఉన్న విజయ్ దేవరకొండ ను మళ్లీ ఫామ్ లో నిలబెట్టింది.

థియేటర్లలో విడుదలైన నెల రోజులకు ఓటీటీలో రిలీజైంది. అక్టోబర్ 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆకట్టుకుంది.

అందుకే.. ఇండియా వైడ్ హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో టాప్ 1 గా ట్రెండ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ కు అమితమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ‘ఖుషి’ నెట్ ఫ్లిక్స్ టాప్ 10 లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Related Posts