టాలీవుడ్ బడా మూవీస్ వరుసగా బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి..!

టాలీవుడ్ లోని బడా స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఈ ఏడాది ఆడియన్స్ కి బాక్సాఫీస్ బొనాంజ ఇవ్వబోతున్నారు. కేవలం ఐదు నెలల సమయంలోనే వీరు నటించిన ఐదు చిత్రాలూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వీటిలో ముందుగా రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ ప్రేక్షకుల్ని పలకరించబోతుంది.

‘సలార్’తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రభాస్ ‘కల్కి’తో మరోసారి ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయడానికి వచ్చేస్తున్నాడు. కాన్సెప్ట్ పరంగా ఎంతో సరికొత్తగా రూపొందుతోన్న ‘కల్కి’ కాస్టింగ్ పరంగానూ ఎంతో ఆసక్తిని కలగజేస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ తో పాటు.. విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. ఇండియాస్ మోస్ట్ మెస్మరైజింగ్ బ్యూటీస్ దీపిక, దిశా పఠాని వంటి వారు ఈ చిత్రంలో సందడి చేయబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ‘కల్కి’ మే 9న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే.. ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఈ చిత్రాన్ని మే చివర్లో లేదా జూన్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు జరుగుతున్నాయి.

మే లేదా జూన్ లో ‘కల్కి’ వస్తే.. ఆగస్టులో ‘పుష్ప’రాజ్ ఆగమనం ఉండబోతుంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ‘పుష్ప.. ది రూల్’ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో మరోసారి తగ్గేదే లే అంటూ ప్రభంజనం సృష్టించడానికి ‘పుష్ప 2’తో రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో.. రెండో భాగం కోసం బడ్జెట్ పరిమితులు పెట్టుకోలేదు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఫస్ట్ పార్ట్ కి ఎన్నో రెట్లు మించిన రీతిలో ‘పుష్ప’ సెకండ్ పార్ట్ తో ఎంటర్ టైన్ మెంట్ పంచడం పక్కా అంటోంది టీమ్. ‘పుష్ప 2’తో స్క్రీన్ ప్లే పరంగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చేసే మ్యాజిక్ సరికొత్తగా ఉండబోతుందట.

ఇక.. సెప్టెంబర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రాబోతుంది. ఆ సమయానికి షూటింగ్ పూర్తవుతోందా? లేదా? అనే అనుమానాలు వెంటాడుతోన్నా.. ఫ్యాన్స్ కి మాత్రం ‘ఓజీ’ రావడం పక్కా అనే సంకేతాలు అందిస్తూనే ఉంది నిర్మాణ సంస్థ డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్. ‘సాహో’ వంటి స్టైలిష్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అందించిన సుజీత్.. ‘ఓజీ’ని మరింత స్టైలిష్ గా తీర్చిదిద్దుతున్నాడట. ఈ మూవీతో వింటేజ్ పవర్ స్టార్ ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నాడట. ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలకు ముస్తాబవుతోంది.

సెప్టెంబర్ చివర్లో ‘ఓజీ’ మిస్సైతే ఆ డేట్ ను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ‘గేమ్ ఛేంజర్’కి ఉన్నాయి. ఒకవేళ ‘ఓజీ’ అనుకున్న సమయానికే వచ్చేస్తే.. ‘గేమ్ ఛేంజర్’ అక్టోబర్ లో స్లాట్ లో రావడం కన్ఫమ్. అక్టోబర్ లో దసరా కానుకగా ఇప్పటికే ‘దేవర 1’ ఫిక్సైంది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ కూడా అక్టోబర్ కే రాబోతుందనే సంకేతాలందించాడు రామ్ చరణ్. మొత్తంమీద.. రాబోయే ఐదు నెలల్లో మన తెలుగులోనూ అగ్ర కథానాయకులందరూ ఒక్కొక్కరిగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి వచ్చేస్తున్నారన్నమాట.

Related Posts