Featured

స్పై (Spy)

నటీనటులు : నిఖిల్ సిద్ధార్ధ, ఐశ్వర్య మీనన్, సాన్య ఠాకూర్, తనికెళ్ల భరణి, ఆర్యన్ రాజేష్, మరకంద్ దేశ్‌పాండే, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రానా దగ్గుబాటి తదితరులు..

ఎడిటర్ : గ్యారీ బిహెచ్

సినిమాటోగ్రఫీ : మార్క్ డేవిడ్, వంశీ పచ్చిపులుసు

సంగీతం : శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్

నిర్మాత : కే.రాజశేఖర్ రెడ్డి (ED ఎంటర్టైన్మెంట్స్)

దర్శకత్వం : గ్యారీ బిహెచ్

కొన్నాళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నిఖిల్ సిద్ధార్థ. అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలు అతనికి మంచి విజయాలు ఇచ్చాయి. వీటిలో కార్తికేయ2 అనుకోకుండా ప్యాన్ ఇండియన్ లెవల్లో సూపర్ హిట్ అయింది. నిఖిల్ కు కొత్త మార్కెట్, ఇమేజ్ ను తెచ్చిది. దీంతో ఆ ఇమేజ్ ను పెంచుకునేందుకు “స్పై”గా వచ్చాడు. మళయాలీ బ్యూటీ ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :
జోర్డాన్ లో ఆయుధాలు తయారు చేస్తూ వాటి ద్వారా వచ్చే డబ్బులతో ఇండియాలో ఉన్న ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ను యాక్టివేట్ చేస్తుంటాడు ఖదిర్ అనే తీవ్రవాది. అతన్ని పట్టుకునేందుకు సుభాష్‌ వర్ధన్. సీక్రెట్ కెమెరాస్ ద్వారా ఇండియాలోని రా చీఫ్ చూస్తుండగానే అతన్ని చంపేస్తాడు. ఆ వెంటనే అతన్ని మరో వ్యక్తి చంపేస్తాడు. అయితే ఐదేళ్ల తర్వాత ఆ ఖదిర్ బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. దీంతో ఖదిన్ ను పట్టుకునేందుకు జై వర్ధన్ (నిఖిల్) ను పంపిస్తుంది రా ఏజెన్సీ. జై అప్పటికే ప్రేమలో మోసపోయి ఉంటాడు. ఇక ఈ మిషన్ కు అతనితో పాటు కమల్(అభినవ్ గోమటం) సరస్వతి(సాన్యాఠాకూర్) తో కలిసి ప్లాన్ చేస్తాడు జై. అతనికి తోడుగా అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ను కూడా పంపిస్తుంది రా. ఇష్టం లేకపోయినా ఆమెతో కలిసి ఖదిర్ ను పట్టుకునే ప్రయత్నంతో పాటు తన అన్నను చంపినవాడిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఖదిర్ కు సంబంధించి ఓ పెద్ద నిజం తెలుస్తుంది. దీంతో పాటు స్వాతంత్ర్యానికి అసలు కారణం వేరే ఉందనే విషయం తెలుసుకుంటాడు.. మరి అదేంటీ..? ఖదిర్ కు సంబంధించి నిజంఏంటీ..? ఇవన్నీ ఛేదించి అతను దేశాన్ని కాపాడాడా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ :
ఏ కథనైనా మొదలుపెడుతున్నప్పుడు దర్శకుడి పర్స్ స్పెక్టివ్ ఏంటనేది తెలిసిపోతుంది. ఈ చిత్రాన్ని జేమ్స్ బాండ్ లెవల్లో స్టార్ట్ చేశాడు. ఆరంభంలోనే జోర్డాన్ లో ఓ మిషన్ లో పెద్ద తీవ్రవాదిని చంపడం.. ఐదేళ్ల తర్వాత అతను చనిపోలేదని తెలియడం.. దానికోసం తన రా ఏజెన్సీలోని బెస్ట్ టీమ్ ను పిలవమని చెప్పడం.. ఇవన్నీ ఎక్స్ పెక్టెడ్ సీన్స్ లా కనిపిస్తాయి. అలాగే జై ఎక్కడ అని రా చీఫ్ (మకరంద్ దేశ్ పాండే) అడగ్గానే అతను ఎక్కడో శ్రీ లంకలో ఓ ఆపరేషన్ లో ఉండటం చూస్తే దర్శకుడు జేమ్స్ బాండ్‌ ను ఫాలో అవుతూ.. స్పై సినిమాల ఫార్ములాను దాటకుండా ఓ కొత్త పాయింట్ చెప్పబోతున్నాడేమో అనిపిస్తుంది. బట్ అలాంటిదేం లేదని మొదటి అరగంటలోనే తెలిసిపోతుంది. సినిమా ఆరంభంలో ఓ టీనేజ్ గాళ్ తో బ్లాస్టింగ్ సీన్ ఉంటుంది. బట్ అది ఎందుకు ఉందో తర్వాత ఎక్కడా చెప్పలేదు. జై జోర్డాన్ వెళ్లడం కంటే ముందు.. తనే ఓ విశ్లేషణ చేస్తాడు.

ఎప్పుడైతే పెద్ద ట్రాన్సాక్షన్స్ జరిగాయో.. అప్పుడే నేపాల్ నుంచి ఓ ట్రక్ వస్తుందని.. దాంట్లో అణుబాంబ్ లు ఉన్నాయని తేలుస్తాడు. అందుకోసం వెంటనే తన టీమ్ తో నేపాల్ వెళతాడు. అక్కడ నానా బిల్డప్పులు ఇచ్చి.. ఓ లారీని ట్రేస్ చేస్తారు. బట్ నేపాల్ బార్డర్ లో ఇద్దరు హోమ్ గార్డ్స్(నిజంగా అంతే సిల్లీగా రాసుకున్నారు ఈ సీన్. దేశ బార్డర్ లో ఎంత సెక్యూరిటీ ఉంటుంది అనే కనీస అవగాహన కూడా వీరికి లేదు అని ఈ సీన్ తో తేలిపోతుంది) మాత్రమే ఉంటే పాపం జై అతని ఫ్రెండ్ కలిసి లారీని వెంటాడి చూస్తే అది ఖాళీగా ఉంటుంది. అప్పుడు రా చీఫ్‌ కు ఫోన్ చేసి అదే జై ”మనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్” అంటాడు. నిజానికి ఆ కాలిక్యులేషన్ చేసేదే అతను. దానికి ఏ లాజిక్ అప్లై చేయడు. ఇక జోర్డాన్ వెళ్లి ఖదిర్ ను పట్టుకునే ప్రయత్నంలో వచ్చే సన్నివేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే ఇంటర్వెల్ లో సుభాస్ చంద్రబోస్ కు సంబంధించిన ఎపిసోడ్ తో సెకండ్ హాఫ్‌ పై కొంత ఆసక్తి పెంచుతారు.


సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకు ఇది ఖచ్చితంగా దేశంలోని ఒక వర్గం ఆడియన్స్ ను మెప్పించేందుకు మాత్రమే రాసుకున్న కథ అని. చరిత్ర నిజాలు చెప్పదు.. దాస్తుందిఅనే డైలాగ్ ద్వారా ఇప్పటి వరకూ మనం చరిత్రలో చదివింది అంతా అబద్ధం అనేలా.. అందుకు కారణం ఫలానా పార్టీ అనే అర్థం వచ్చేలాంటి సీన్స్ ను డైరెక్ట్ గానే పెట్టారు. అందుకోసం రానాను వాడుకున్నారు. గెస్ట్ గా వచ్చిన రానా ఆవేశంగా గాంధీ, నెహ్రూలు ఈ దేశానికి ద్రోహం చేశారు. సుభాస్ బోసే స్వాంతంత్ర్యం తెచ్చాడు. అని ఆల్మోస్ట్ డైరెక్ట్ గానే చెబుతాడు. దీన్ని బట్టి ఇది ఓ కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటి సినిమాల కోవలోదే అని క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక ఖదిర్ వెనక మరో మాస్టర్ మైండ్ ఉందని తెలిసిన తర్వాత వచ్చే సీన్స్.. 80ల్లో రావు గోపాలరావు, కృష్ణ, చిరంజీవిలాంటి వారు చేసిన గూఢచారి సినిమాల కంటే తక్కువ స్థాయిలో ఉందంటే అతిశయోక్తి కాదు. న్యూక్లియర్ మిసైల్ అంటే మరీ మనవాళ్లకు దీపావళి టపాస్ లా మారింది.
ఉన్నంతలో కొత్త పాయింట్ ఏంటంటే.. అదే పనిగా పాకిస్తాను ను తిట్టలేదు. అలాగే పాకిస్తాను వాడైన విలన్ మన దేశంపై దాడి చేయకుండా మన దేశంలో ఒకప్పటి బోస్ స్థావరం నుంచి న్యూక్లియర్ బాంబ్ ను ఆపరేట్ చేస్తూ చైనాపై ప్రయోగించాలనుకుంటాడు. అప్పుడు చైనా.. మనమే దాడి చేస్తున్నాం అని భావించి యుద్ధానికి వస్తుంది. ఇది కొత్తగా ఉంది. బట్ ఈ సీన్ ను కూడా సిల్లీగానే చిత్రీకరించారు. ఏ మాత్రం ఇంటెన్సిటీ కనిపించదు. ఆ చివర్లో వచ్చే బాంబ్ ను నిర్వీర్యం చేయడం అనే ఫైట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.


ఓవరాల్ గా చూస్తే ఇది కేవలం చారిత్రక వక్రీకరణలు జరిగాయని చెప్పడానికి.. అసంబద్ధమైన స్క్రీన్ ప్లే.. అసలే మాత్రం పస లేని కథతో రెండున్నర గంటల పాటు సహనాన్ని పరీక్ష పెడుతుంది. నిజంగా ఓ స్పై సినిమాకు ఉండాల్సిన కనీస లక్షణాలు కథలో లేవు. అలాగే స్పై లు ఏం చేస్తారు, దేశ రక్షణ కోసం వారు ఎలాంటి పనులు చేస్తారు అనే కనీస అవగాహన కూడా లేనివాళ్లు కలిసి చేసిన ఓ విఫల ప్రయత్నంగా కనిపిస్తుది.

నటన పరంగా నిఖిల్ తను స్పై గా నటిస్తున్నాను అనే ఉత్సాహం చూపించాడు. కానీ ఆ పాత్రలో ఉండాల్సిన సిన్సియారిటీ అతని ఫేస్ లో కనిపించలేదు. హీరోయిన్ కు నటించే అవకాశం రాలేదు. యాక్షన్ సీన్స్ బానే చేసింది. ఓ పాటలో గ్లామరస్ గా కనిపించింది. అభినవ్ గోమటం కూడా రా ఏజెంటే. కానీ అతన్ని బఫూన్ లానే చూపించారు. మరో ఇద్దరు ముగ్గురు ఏజెంట్స్ ఉన్నారు.అందరివీ ఊహించగలిగే పాత్రలే. రా చీఫ్‌ గా మకరంద్ దేశ్ పాండే అస్సలు సూట్ కాలేదు. పిఎమ్ గా సచిన్ ఖేద్కర్ ఓకే. తనికెళ్ల భరణి, పోసాని, సురేష్‌ లాంటి వారు ఉన్నా.. వారి పాత్రలకు ఏ ఉనికీ లేదు.


టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ పరంగా చాలా కట్స్ వేసుకోవచ్చు ఇంకా. సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. శ్రీ చరణ్‌ పాకాల నేపథ్య సంగీతం హైలెట్ గా ఉంది. బాగా చేశాడు. డైలాగ్స్ అసలు బాలేదు. ఆర్ట్ వర్క్, సెట్స్ బావున్నాయి. గ్రాఫిక్స్ నాసి రకంగా ఉన్నాయి. నిర్మాతే కథ కూడా అందించాడు. కథ వీక్ గా ఉన్నా.. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకత్వం పరంగా గ్యారీ అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఓ ఎడిటర్ గా అతనికి దర్శకత్వం మీద కాస్తైనా పట్టుండాలి. బట్ అదేం కనిపించలేదు. అలాగే ఎడిటింగ్ కూడా తేలిపోయింది.
ఈ మూవీతో ప్యాన్ ఇండియన్ స్టార్ కావాలనుకున్న నిఖిల్ డ్రీమ్స్ కు బ్రేక్ పడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చేమో.

ఫైనల్ గా : డిజప్పాయింటెడ్

రేటింగ్ : 2/5

                - బాబురావు. కామళ్ల.
Telugu 70mm

Recent Posts

‘దేవర’ ఫస్ట్ సింగిల్.. ఎన్టీఆర్ కోతకు అనిరుధ్ మోత

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…

1 hour ago

మహేష్-రాజమౌళి సినిమాలో మలయాళీ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…

4 hours ago

కమల్ కి డబుల్ ధమాకా ఇవ్వబోతున్న శంకర్

మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…

4 hours ago

బాబాయ్ కోసం అబ్బాయ్ అవుట్?

నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…

4 hours ago

‘కల్కి‘లోని బుజ్జి పరిచయం కోసం భారీ వేడుక

రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…

5 hours ago

Two Things Are troubling ‘Pushpa 2’

After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…

10 hours ago