Featured

సిసలైన యాక్షన్ తో సల్మాన్ ‘సికందర్’

బాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఒక్క షారుక్ తప్పితే.. మిగతా వాళ్లంతా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈ లిస్టులో కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. గత ఏడాది ఎన్నో అంచనాలతో వచ్చిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’ చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. దాంతో.. ఇప్పుడు తన ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ ‘సికందర్’పైనే పెట్టుకున్నాడు.

‘సికందర్’ చిత్రానికి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. గతంలో అమీర్ ఖాన్ కి ‘గజిని’ వంటి మెమరబుల్ హిట్ అందించాడు మురుగదాస్. ఆ తర్వాత అక్షయ్ తో ‘తుపాకీ’ రీమేక్ ‘హాలిడే.. ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ని తెరకెక్కించాడు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ లో బడా హీరో సల్మాన్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 2025, ఈద్ కానుకగా సల్మాన్-మురుగదాస్ చిత్రం విడుదలకానుందట. సాజిద్ నదియడ్ వాలా నిర్మాణంలో రూపొందే ఈ సినిమాలో రష్మిక నాయికగా నటించనున్నట్టు బీటౌన్ టాక్.

ఇక.. ‘సికందర్’ సినిమాని ఆద్యంతం ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నాడట మురుగదాస్. ఈ సినిమాకోసం 33 వేల అడుగుల ఎత్తులో యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే.. ‘సికందర్’పై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది.

Telugu 70mm

Recent Posts

రాజ్ తరుణ్ యాక్షన్ అవతార్ లో ‘తిరగబడరసామీ..‘

యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…

12 hours ago

దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సుహాస్

‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…

13 hours ago

‘డార్లింగ్‘ నుంచి నభా నటేష్ ‘రాహి రే‘ సాంగ్

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…

14 hours ago

Ashika Ranganath

14 hours ago

వెంకటేష్ సరసన కథానాయికలు ఖరారు..!

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…

14 hours ago

తెలుగు చిత్ర పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి కండిషన్స్

సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…

14 hours ago