అమితాబ్ షో లో రష్మిక సందడి.. ప్రపోజ్ చేసిన కంటెస్టెంట్

అమితాబ్ బచ్చన్ పాపులర్ షో కౌన్ బనేగా కరోడ్ పతి 15వ సీజన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. లేటెస్ట్ ఎపిసోడ్ లో నేషనల్ క్రష్ రష్మిక వీడియో కాల్ లో కంటెస్టెంట్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇంతకీ విషయమేమిటంటే.. కంటెస్టెంట్ ప్రమోద్ భస్కేకి రష్మిక అంటే చాలా ఇష్టం. ఆమె మొదటి సినిమా నుంచే అభిమానించడం మొదలుపెట్టాడట. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా రష్మిక కి ప్రపోజల్ కూడా పెట్టాడు. దానికి రష్మిక రిప్లై ఇవ్వడం విశేషం. ఆ విషయాలన్నీ కె.బి.సి లో పంచుకున్నాడు.

దీంతో వెంటనే రష్మిక ను వీడియో కాల్ లో తీసుకున్నాడు బిగ్ బి. ఆశ్చర్యపోవడం కంటెస్టెంట్ వంతైంది. అతని గేమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ త్వరలో పర్సనల్ గా కలుస్తానని అతనికి మాటిచ్చింది రష్మిక. ఈ సందర్భంగా ‘యానిమల్’ సినిమాలోని రష్మిక పెర్ఫామెన్స్ ను పొగడ్తలతో ముంచెత్తారు అమితాబ్. బాలీవుడ్ లో అమితాబ్ తో కలిసి ‘గుడ్ బై’ మూవీలో నటించింది రష్మిక.

Related Posts