ఎన్టీఆర్ అభిమానికి అండగా నిర్మాత ఎస్.కే.ఎన్

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి గీతా ఆర్ట్స్ అండదండలతో నిర్మాతగా మారిన ఎస్.కె.ఎన్.. ‘బేబి‘ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తన నిర్మాణంలో వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఎస్.కే.ఎన్.. స్పీచెస్ కి సెపరేట్ క్రేజుంది. పలు వేదికలపై తనదైన పంచెస్ తో అదరిపోయే స్పీచెస్ ఇస్తుంటాడు ఎన్.కే.ఎన్. సరదాగా పంచులతో, ప్రాసలతో మాట్లాడుతూ నవ్వించే ఎస్.కే.ఎన్.. కొన్ని సామాజిక విషయాల్లో మానవత్వం చాటడంలోనూ అందరికంటే ముందుంటాడు.

ఇటీవల దర్శకుల సంఘం ఎన్నికల్లో సంఘ సభ్యుల సంక్షేమ కార్యక్రమాల కోసం 10 లక్షల రూపాయల డొనేట్ చేశాడు ఎస్ కేఎన్. తాజాగా రోడ్డు ప్రమాదానికి గురైన ఎన్టీఆర్ అభిమానికి అండగా నిలబడ్డాడు. అతనిది పేద కుటుంబం కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విరాళాల కోసం రిక్వెస్ట్ చేశారు. ఈ రిక్వెస్ట్ కు స్పందించిన ఎస్.కే.ఎన్ 50 వేల రూపాయలు తన వంతు సహాయంగా పంపించాడు

Related Posts