‘ప్రతినిధి 2‘ రిలీజ్ ట్రైలర్.. సిస్టమ్ లోని లోపాల గురించి పోరాటం

ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న చిత్రాలలో ‘ప్రతినిధి 2‘ ప్రత్యేకమైనది. ఎందుకంటే.. నారా రోహిత్ చాలా గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకొస్తుంది ‘ప్రతినిధి 2‘ చిత్రంతోనే. మరోవైపు.. జర్నలిస్ట్ గా పాపులరైన మూర్తి దర్శకుడిగా పరిచయమవుతోన్న మూవీ. అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ ఎన్నికల వేడిలో రాబోతున్న అసలుసిసలు పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2‘.

అసలు ఏప్రిల్ 25 నే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ‘ప్రతినిధి 2‘.. మే 10న విడుదలకు ముస్తాబవుతోంది. మొన్నటివరకూ సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొందనే ప్రచారం జరిగినా.. ఈ చిత్రం అన్ని అడ్డంకులు దాటుకుని సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు/ఎ‘ సర్టిఫికెట్ పొందింది. ఈ శుక్రవారం ‘ప్రతినిధి 2‘ విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను వదిలింది. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు ఒకెత్తయితే.. ఈ రిలీజ్ ట్రైలర్ మరో ఎత్తు అన్నట్టుంది. ఈ ట్రైలర్ తో ‘ప్రతినిధి 2‘పై అంచనాలు మరింత పెరిగాయి.

Related Posts